బిగ్ బాస్ 9.. కొత్త కెప్టెన్ ఎవరు.. ఎలా గెలిచిందంటే..?
బిగ్ బాస్ సీజన్ 9 లో ఎనిమిదో వారం కెప్టెన్ గా ఎవరు గెలిచారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
By: Ramesh Boddu | 1 Nov 2025 9:12 AM ISTబిగ్ బాస్ సీజన్ 9 లో ఎనిమిదో వారం కెప్టెన్ గా ఎవరు గెలిచారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రతి వారం ట్విస్ట్ లు, టర్న్ లు అన్నట్టుగా హౌస్ లో పరిస్థితి కనిపిస్తుంది. ఎలిమినేట్ అయిన శ్రీజ, భరణి హౌస్ లోకి రావడం వాళ్లలో ఒకరు మళ్లీ హౌస్ లో కొనసాగుతారని చెప్పడంతో ఆసక్తి పెరిగింది. ఐతే భరణి, శ్రీజ కోసం మిగతా హౌస్ మెట్స్ కూడా టాస్క్ లు ఆడారు. 4 టాస్క్ లు పెడితే ఒకటి సంచాలక్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో క్యాన్సిల్ అవ్వగా మిగిలిన మూడింటిలో రెండు భరణి ఒకటి శ్రీజ గెలిచింది.
భరణి తనతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్..
బిగ్ బాస్ సీజన్ 9లో భరణి మళ్లీ హౌస్ లో పర్మినెంట్ కంటెస్టెంట్ అయ్యాడు. ఇక ఈ వారం కెప్టెన్ క్యాండిడేట్స్ అన్నది భరణిని నిర్ణయించమని చెప్పారు బిగ్ బాస్. భరణి తనకు రీ ఎంట్రీ టాస్క్ లల్లో సపోర్ట్ చేసిన వారిని పరిగణలోకి తీసుకున్నాడు. అందులో ఇప్పటివరకు కెప్టెన్ అవ్వని వారిని భరణి కంటెండర్స్ గా సెలెక్ట్ చేశాడు. ఈ క్రమంలో భరణి తనతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్ పేర్లను ఎంపిక చేశాడు.
వీరితో డీజే కెప్టెన్ అంటూ రెండు పోడియం లు ఏర్పాటు చేసి సింగిల్ గా ఒక పోడియం మీద కెప్టెన్సీ కంటెండర్స్ డాన్స్ చేస్తే అవతల వారికి సపోర్ట్ గా ఉన్న వారు డాన్స్ చేయాలి. అలా సాయికి ఒకరు మాత్రమే డాన్స్ చేయగా నిఖిల్ కి ముగ్గురు సపోర్ట్ చేశారు. భరణికి నలుగురు ఫైనల్ గా దివ్యకి ఐదుగురు, తనూజకి ఎనిమిది మంది హౌస్ మెట్స్ సపోర్ట్ చేశారు. ఇక టాప్ 2 గా ఉన్న తనూజ, దివ్య కు మరోసారి అదే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.
దివ్యా పోడియం మీద ఎక్కువ మెంబర్స్..
అలా దివ్యా, తనూజ చెరో పోడియం మీద నిలబడగా వారికి సపోర్ట్ చేసే వారు వారితో కలిసి వారి పోడియం ఎక్కాలి. అలా తనూజ పోడియం మీద మాధురి, రీతు, పవన్ మాత్రమే ఉన్నారు. దివ్య పోడియం మీద ఇమ్మాన్యుయెల్, సంజన, గౌరవ్, సాయి, సుమన్ శెట్టి ఉన్నారు. భరణి, నిఖిల్ ఎవరికి సపోర్ట్ చేయకూడదని ఎవరి పోడియం ఎక్కలేదు. ఈ టాస్క్ కి రాము సంచాలక్ గా ఉన్నాడు.
ఫైనల్ గా తనూజ కన్నా దివ్యా పోడియం మీద ఎక్కువ మెంబర్స్ ఉండటంతో దివ్య కెప్టెన్ గా గెలిచిందని బిగ్ బాస్ వెల్లడించాడు. కెప్టెన్ గా ప్రతిసారి చివరి వరకు వచ్చి ఓడిపోతున్నందుకు తనూజ బాగా ఎమోషనల్ అయ్యింది. హౌస్ లో తనకంటూ ఎవరు లేరని ఆమె మాధురితో చెప్పింది. మాధురి, రీతు, పవన్ తనూజని కన్సోల్ చేయాలని చూశారు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్
