పిక్‌టాక్ : వర్కౌట్ ఔట్ ఫిట్‌లో అందాల దివి
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉండే దివి తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది.
By: Tupaki Desk | 8 July 2025 6:44 PM IST
తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్ ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ దివి. ఆ షోలో మొదట సైలెంట్‌గా ఉన్న దివి కొన్ని ఎపిసోడ్స్ తర్వాత తన విశ్వరూపం చూపించింది. దాంతో అందరూ దివి గురించి మాట్లాడుకోవడం జరిగింది. బిగ్‌బాస్‌లో పాల్గొనడానికి ముందు చాలా సినిమాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రల్లో నటించింది. కానీ గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఎప్పుడైతే దివి బిగ్‌బాస్‌లో కనిపించిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య వేల నుంచి లక్షకు చేరింది. తక్కువ సమయంలోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరగడం మాత్రమే కాకుండా సినిమా ఆఫర్లు వచ్చాయి.
బిగ్‌బాస్ తో వచ్చిన పాపులారిటీతో దివికి సినిమాల్లో, సిరీస్‌ల్లో ఆఫర్లు వచ్చాయి. పలు సినిమాల్లో లీడ్ రోల్స్‌లో కనిపించింది. కానీ ఆ సినిమాలు చిన్న సినిమాలు కావడంతో పాటు, పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేయడం వల్ల ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. వెబ్ సిరీస్‌లో నటించడం ద్వారా తనలోని నటిని చూపించింది. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ నటించే అవకాశం దక్కించుకుంది. బిగ్‌బాస్ స్టేజ్ పై దివికి చిరంజీవి హామీ ఇచ్చారు. ఆయన తన మాట ప్రకారం సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా నిరాశ పరచడంతో పాటు, ఆ సినిమాలోని ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో ఆ తర్వాత ఆఫర్లు పెద్దగా రాలేదు.
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉండే దివి తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి వర్కౌట్ సమయంలో వేసుకునే టైట్ పాయింట్‌తో పాటు, స్పోర్ట్సో బ్రా లో కనిపించింది. దివి సాధారణంగానే చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి ఔట్ ఫిట్‌లో కనీసం చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ ఇలాంటి ఫోటోలతో మరింతగా పెరుగుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ దివి సొంతం అంటూ ఈ ఫోటోలు చెప్పకనే చెబుతున్నాయి.
ఇంత అందంగా ఉన్నప్పటికీ దివికి సినిమాల్లో మెయిన్ లీడ్ ఆఫర్లు రాకపోవడంకు కారణం తెలుగు అమ్మాయి కావడం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ దివి జన్మించింది. శశికాంత్, దేవకీ దంపతలుకు జన్మించింది. జూబ్లీహిల్స్‌లోని పబ్లిక్ స్కూల్‌లో చదివిన దివి నారాయణమ్మ కాలేజ్లో ఎంబీఏ పూర్తి చేసింది. కాలేజ్ రోజుల నుంచే మోడలింగ్ పై ఆసక్తితో అటు వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చాయి. దాంతో చదువుతూనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ ఈమె నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.