చిచ్చాతో విజ్జిపాప సెల్ఫీ..
అమెరికాలో ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే నాట్స్ ఉత్సవాలకు టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
By: Tupaki Desk | 7 July 2025 8:00 PM ISTఅమెరికాలో ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే నాట్స్ ఉత్సవాలకు టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. టంపాలో జరిగిన నాట్స్ 8వ తెలుగు సంబరాల్లో అల్లు అర్జున్, సుకుమార్, రాఘవేంద్రరావు, బాలకృష్ణ, శ్రీలీల హాజరయ్యారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని ఆ వేడుకలను మరింత ఘనంగా జరిగేలా చేశారు.
ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆయా సెలబ్రిటీలు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ లో నుంచి ఓ క్యూట్ వీడియో ఒకటి బయటికొచ్చి వైరల్ అవుతుంది. నందమూరి బాలకృష్ణతో శ్రీలీల సెల్ఫీ తీసుకుంటుండగా దాన్ని ఎవరో తమ వీడియోలో బంధించగా ఆ వీడియోను నెటిజన్లు లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ఈ వీడియోలో శ్రీలీల, బాలకృష్ణతో సెల్పీ తీసుకుంటుండగా ఆ ఫోటోకు బాలయ్య చిల్ అవుతూ పోజులిచ్చారు. మధ్యలో తన షర్ట్ కాలర్ సరిగా లేదని, ఆ కాలర్ ను ఎత్తి మరీ శ్రీలీలతో సెల్ఫీలు దిగారు బాలయ్య. అయితే ఈ వీడియో ఇంతలా వైరల్ అవడానికి కారణాలు లేకపోలేదు. బాలయ్య, శ్రీలీల కలిసి గతంలో భగవంత్ కేసరి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య, శ్రీలీల తండ్రీ కూతుళ్లుగా కనిపించారు. సినిమాలో వీరిద్దరి మధ్య బాండింగ్ గురించి అప్పట్లో తెగ చర్చలు నడిచాయి. ఇప్పటికీ చిచ్చా అంటూ శ్రీలీల, విజ్జి పాప అంటూ బాలయ్య ఒకరినొకరు ఎంతో ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు.