బాలయ్య మాన్షన్ హౌస్ అలజడి.. ఇది పరిస్థితి!
నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఏది పట్టినా బంగారమే అనేలా మహర్దశ నడుస్తోంది.
By: Tupaki Desk | 16 May 2025 11:30 AM ISTనందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఏది పట్టినా బంగారమే అనేలా మహర్దశ నడుస్తోంది. సినిమాలు వంద కోట్లు, టాక్ షో టాప్ రెస్పాన్స్.. పాలిటిక్స్ లో వరుస విజయాలు ఆయన క్రేజ్ ను మరింత బలంగా మారుస్తున్నాయి. ఇక నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా అవేమి జై బాలయ్య ముందు నిలబడవు అనేలా పాజిటివ్ టైమ్ నడుస్తోంది. ఇక అన్ని మంచి శకునములే.. అనే సమయంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం కాస్త వివాదస్పదంగా మరే గాలులు వీస్తున్నాయి.
బాలయ్య డ్రింక్ చేస్తారు అనే విషయం అందరికి ఎప్పటి నుంచో తెలుసు. తనకు ఇష్టమైన బ్రాండ్ మాన్షన్ హౌస్ గురించి ఆయన బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇటీవల ఈ బ్రాండ్‌కు బాలయ్య అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు, ఓ ప్రచార వీడియో కూడా విడుదలైంది. అయితే, ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది, అభిమానుల్లో చర్చలు రేగాయి.
లీగల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండానే మాన్షన్ హౌస్ వాటర్ బాటిల్ అంటూ తెలివిగా యాడ్ చేశారు. చాలామంది సినీస్టార్స్ ఆల్కహాల్ విషయంలో ఇలానే చేస్తారు. అయితే మిగతా స్టార్స్ కంటే బాలయ్యకు ఉన్న క్రేజ్ వేరు. ఇక బాలకృష్ణ ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు, ఇది భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. ఇలాంటి గౌరవం పొందిన వ్యక్తి మద్యం బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం సరైనదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
యూత్‌పై మద్యం ప్రభావం ఎంతగా ఉంటుందో ఆలోచించాలని, బాలయ్య లాంటి స్టార్ హీరో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కొందరు అంటున్నారు. అయితే, ఈ యాడ్ చట్టపరంగా సరైనదేనని కొందరు సమర్థిస్తున్నారు. మద్యం బ్రాండ్లు తమ ప్రమోషన్ కోసం ఇలాంటి స్ట్రాటజీలు ఉపయోగించడం సర్వసాధారణం, ఇది చట్ట విరుద్ధం కాదని అంటున్నారు.
బాలకృష్ణ తన వ్యక్తిగత ఇష్టాన్ని బహిరంగంగా చెప్పడంలో ఎప్పుడూ నిజాయితీగా ఉంటాడని, ఈ ఎండార్స్మెంట్ కూడా ఆయన వ్యక్తిగత ఎంపికేనని ఆయన అభిమానులు సమర్థిస్తున్నారు. అయితే, ఈ చర్య నీతిపరంగా సరైనదేనా అని చర్చలు జోరుగా సాగుతున్నాయి. బాలకృష్ణ గతంలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షోలో మాన్షన్ హౌస్ గురించి బహిరంగంగా మాట్లాడారు, ఆ షోకు ఈ బ్రాండ్ స్పాన్సర్‌గా కూడా ఉంది.
ఇప్పుడు అధికారికంగా ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం ద్వారా ఆయన తన స్టాండ్‌ను మరోసారి స్పష్టం చేశారు. కానీ, హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఈ ఎండార్స్‌మెంట్‌తో యూత్‌కు తప్పుడు సందేశం ఇస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. ఇక నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా కుఫా బాలయ్య పెద్దగా పట్టించుకోరని తెలిసిన విషయమే. ఇక దీన్ని కూడా ఆయన లెక్క చేయకపోవచ్చు.