Begin typing your search above and press return to search.

'పుష్ప'లా అయిపోతా.. అల్లుళ్లతో బాలయ్య క్రేజీ ఫన్!

రీసెంట్ గా హైదరాబాద్ లో మాజీ ఎంపీ, బంధువు కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకకు బాలయ్య వెళ్లారు. అల్లుళ్లు నారా లోకేష్, శ్రీ భరత్‌ తో కలిసి పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 5:26 PM IST
పుష్పలా అయిపోతా.. అల్లుళ్లతో బాలయ్య క్రేజీ ఫన్!
X

టాలీవుడ్ నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు బెస్ట్ స్టేజ్ లో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఓవైపు వరుస సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటున్నారు. తన టాలెంట్ తో మెప్పిస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు.

అదే సమయంలో కుటుంబంతో కూడా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లలో సందడి చేస్తుంటారు. తన సతీమణి, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లతో కనిపిస్తుంటారు. రీసెంట్ గా హైదరాబాద్ లో మాజీ ఎంపీ, బంధువు కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకకు బాలయ్య వెళ్లారు. అల్లుళ్లు నారా లోకేష్, శ్రీ భరత్‌ తో కలిసి పాల్గొన్నారు.

అప్పుడు తన ఇద్దరు అల్లుళ్లతో కలిసి ఫోటో దిగేందుకు వేదికపైకి బాలయ్య వెళ్లారు. లోకేష్, భరత్ పై భుజాలపై చేతులు వేసి ఫోటో దిగాలని చూశారు. అప్పుడు చిన్నల్లుడు భరత్‌ ను సరదాగా వ్యాఖ్యానించారు. నీ మీద చేయి వేయాలంటే ప్రాబ్లం.. పుష్ప లా అయిపోతా.. అందుకే ఇక్కడ వేశా అని సడెన్ గా బాలయ్య అనడంతో నవ్వేశారు.

ఆ తర్వాత బాలయ్య ఇక్కడైతే హ్యాపీ అంటూ లోకేష్ భుజం మీద చేతులు వేశారు. అనంతరం ఇద్దరు అల్లుళ్ళ భుజాలపై చేతులు వేసి పిక్ తీసుకున్నారు. మొత్తానికి ఆ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య టైమింగ్ సూపర్ అని కామెంట్లు పెడుతున్నారు. ఫన్నీ డైలాగ్ సూపర్ అని చెబుతున్నారు.

కాగా.. బాలయ్య ఇద్దరు అల్లుళ్లు కూడా రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, బాలయ్య పెద్ద అల్లుడు నారా లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్విస్తున్నారు. మరోవైపు, చిన్న అల్లుడు శ్రీ భరత్.. ఇప్పుడు విశాఖపట్నం ఎంపీగా గెలిచి పార్లమెంట్ కు వెళ్లారు.

అలా మొత్తానికి మామా అల్లుళ్లు ముగ్గురూ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. అధికార కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీలోనే ఉన్నారు. అయితే తమ వర్క్ తో ఎప్పుడూ తలమునకలయ్యే వారు ముగ్గురూ.. ఇప్పుడు సరదాగా కనపడిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. మరి మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.