భాఘి 4 ట్రైలర్: రక్తపాతం హింస .. వామ్మోవ్ ఇంత ఘోరమా!
అక్కడ క్రియేటర్లలో మ్యాటర్ కనిపించకపోయేసరికి భాఘి 4 కోసం దక్షిణాది దర్శకుడితో పని చేసాడు. కన్నడిగ నిమ్మ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
By: Sivaji Kontham | 12 Aug 2025 8:19 PM ISTఈ ట్రైలర్ చూశాక మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా? అని షాక్ కి గురవుతారు. ఇది యానిమల్ కి పది రెట్లు. కిల్, మార్కో లాంటి చిత్రాలకు జేజమ్మ. మానవత్వం మర్చిపోయిన ప్రపంచానికి ఇది నివాళిగా కనిపిస్తోంది. మొత్తానికి టైగర్ ష్రాఫ్ చాలా కాలంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు. హిందీ పరిశ్రమలో సరిగా పప్పులుడకలేదు. అక్కడ క్రియేటర్లలో మ్యాటర్ కనిపించకపోయేసరికి భాఘి 4 కోసం దక్షిణాది దర్శకుడితో పని చేసాడు. కన్నడిగ నిమ్మ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సాజిద్ నడియాడ్ వాలా ఈ చిత్రానికి నిర్మాత.
అయితే భాఘి 4 ట్రైలర్ రిలీజ్ ప్రకటనకు సంబంధించిన పోస్టర్ వేయగానే ఇది మరో క్రూయెల్ బ్లడీ యాక్షన్ మూవీ అని అందరికీ అర్థమైపోయింది. కత్తులు, కటార్లు, గొడ్డళ్లు, మాంసం దుమ్ములు కొట్టే బండ కత్తులు, చివరికి ఇనపరాడ్లతో బాదుకోవడం, ఇనప చువ్వల్ని బుర్రలోకి దించేయడం.. నరకడం, పొడుచుకోవడం... ఎటు చూసినా ఏరులై పారుతున్న రక్తంలో తడిసి ముద్దవ్వడం.. చూస్తుంటేనే గగుర్పాటుకు గురి చేస్తోంది.
ఇటీవలి కాలంలో ఇంతటి దారుణమైన రక్తపాతాన్ని సృష్టించిన వేరొక సినిమా ఏదీ లేదు. ఇది రణబీర్ కపూర్ యానిమల్ కంటే పది రెట్లు అధిక రక్తపాతం, హింసతో కూడుకున్న సినిమా అని అర్థమవుతోంది. ఇందులో టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ పాత్రలను చూస్తుంటే యానిమల్ లో రణబీర్ (రణ్ విజయ్), బాబి డియోల్ (అబ్రార్) పాత్రలను తలపిస్తున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ట్రైలర్ లో అందాల కథానాయికలు సైతం నరుకుతూ చంపుతూ రక్తంలో తడిసి ముద్దవుతూ ఆనందిస్తున్న విజువల్స్ ని దర్శకుడు చూపించాడు అంటే ఇది ఎంత పెద్ద బ్లడీ రక్త పిశాచ సినిమానో అర్థం చేసుకోవచ్చు. మనుషులు ఇంత కంటే క్రూరమైన వాళ్లు ఉన్నారు.. కానీ అది కాదు మ్యాటర్.. ఇంతటి దారుణమైన రక్తపాతంతో తెరపై సినిమాని చూపించాలనే ఆలోచన దర్శకనిర్మాతలకు ఎలా వచ్చింది? అన్నదే ఇక్కడ ప్రశ్న.. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాలనే ఆత్రుతలో అత్యంత దారుణమైన విజువల్స్ తో సినిమాలు తీయడం నిజంగా ప్రజల దురదృష్టం అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనుషుల్లో మానవత్వం ఒకవేళ ఒక శాతం మిగిలి ఉన్నా ఇలాంటి సినిమాలు చూశాక అది పూర్తిగా చర్చిపోవడం గ్యారెంటీ!