సైలెంట్‌గా సచిన్ టెండూల్కర్ కుమారుడి నిశ్చితార్థం
25 ఏళ్ల అర్జున్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలింగ్ గా ఆల్ రౌండర్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అతను దేశీయ క్రికెట్‌లో గోవా తరపున ఆడుతున్నాడు.
By: Sivaji Kontham | 14 Aug 2025 12:00 AM ISTలెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఈ జంట చూడముచ్చటైన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. సానియా చందోక్ అర్జున్ సోదరి సారా టెండూల్కర్ కి అత్యంత సన్నిహితురాలు అని తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థం గురించి టెండూల్కర్ కుటుంబం కానీ, రవిఘాయ్ కుటుంబం కానీ అధికారికంగా ధృవీకరించలేదు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం..కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో సింపుల్ గా ఈ వేడుకను నిర్వహించారని తెలిసింది. సచిన్ కుమారుడు పెళ్లాడబోయే అమ్మాయి వందల కోట్ల సంస్థానాలకు అధిపతి సానియా చందోక్ ముంబైలో ఉన్న మిస్టర్ పావ్స్ పెట్ స్పా అండ్ స్టోర్ LLPలో భాగస్వామి. బోర్డ్ డైరెక్టర్ అని కూడా తెలుస్తోంది. రవి ఘాయ్ కుటుంబం ఆతిథ్య - ఆహార రంగాల్లో శిఖరాలను తాకిన గొప్ప వ్యాపారవేత్తలు. ఇంటర్ కాంటినెంటల్ హోటల్ బ్రాండ్స్ తో వారు పాపులర్. ప్రసిద్ధ ఐస్ క్రీం బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీ దేశవ్యాప్తంగా పాపులరైంది.
25 ఏళ్ల అర్జున్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలింగ్ గా ఆల్ రౌండర్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అతను దేశీయ క్రికెట్‌లో గోవా తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున కూడా ఆడాడు. ఇక అర్జున్ ని పెళ్లాడే అమ్మాయి సానియా మీడియా గ్లేర్ కి దూరంగా ఉండేందుకు ఇష్టపడుతుంది. ముంబైలో అత్యంత పాపులర్ వ్యాపారవేత్తల కుటుంబంతో సచిన్ కుటుంబం బంధం కలుపుకోవడంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. నిశ్చితార్థం సింపుల్ గా జరిగినా, పెళ్లి మాత్రం అంబానీల రేంజులో ఉంటుందని అభిమానులు ఊహిస్తున్నారు.