Begin typing your search above and press return to search.

అర్జున్ S/o వైజయంతి బాక్సాఫీస్.. 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే?

తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. అంచనాలు పెంచుతూ మూడో రోజు భారీ కలెక్షన్లు నమోదు చేసింది.

By:  Tupaki Desk   |   21 April 2025 11:30 AM IST
అర్జున్ S/o వైజయంతి బాక్సాఫీస్.. 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే?
X

ఇటీవల కాలంలో థియేటర్లలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ యాక్షన్ కలగలిసిన సినిమాలు కొద్దిగా తగ్గిన వేళ, నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తొలి రోజు నుంచే ఈ సినిమా సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తోంది. ఎమోషనల్ డ్రామా, తల్లీకొడుకుల బంధం, మాస్ ఫైట్‌లు అన్నీ కలిసి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.


ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విజయవంతమైన ఫార్ములాతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా విజయశాంతి పాత్ర సినిమాకే హార్ట్ లైన్ లా నిలుస్తోంది. ఆమె తల్లి పాత్రలో చేసిన సీరియస్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని టచ్ చేసింది. మరోవైపు, కళ్యాణ్ రామ్ తన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మాస్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చాడు.

తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. అంచనాలు పెంచుతూ మూడో రోజు భారీ కలెక్షన్లు నమోదు చేసింది. మేకర్స్ విడుదల చేసిన తాజా పోస్టర్ ప్రకారం, మూడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ₹12.85 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్ సీజన్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ముఖ్యంగా మౌత్ టాక్ బాగుండటంతో కలెక్షన్ల ఊపు కొనసాగుతుంది.

ఈ కలెక్షన్ల ప్రభావంతో థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరుగుతున్నాయి. ఆదివారం ట్రెండ్‌ను బట్టి చూస్తే వారంరోజుల వరకూ సినిమా స్టడీగా నడిచే అవకాశం ఉంది. రెండవ వారంలో కూడా ఈ సినిమా పాజిటివ్ ట్రెండ్ కొనసాగిస్తే, లాభాల బాటలో మరింత దూసుకుపోయే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా ఆకట్టుకుంటుండగా, అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సినిమాకు బలమైన అండగా నిలుస్తోంది. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే.. ఈ వేసవిలో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే మూవీగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నిలుస్తోంది. ఇప్పుడు మూడురోజుల వసూళ్లతో మరింత బజ్ పెంచిన ఈ చిత్రం, నాలుగో రోజు నుండి ఎలా నిలబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పటి వరకు కనిపిస్తున్న ట్రెండ్ బట్టి చూస్తే, ఇది ఖచ్చితంగా హిట్ ట్రాక్ లో నడుస్తోంది.