అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి: రెండో రోజు కూడా అదే దూకుడు
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి ముఖ్యపాత్రలో నటించిన "అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి" సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది.
By: Tupaki Desk | 20 April 2025 5:24 PM ISTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి ముఖ్యపాత్రలో నటించిన "అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి" సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి ఎమోషనల్ కనెక్ట్‌ను కలిగిస్తోంది. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా మారింది.
మదర్ సన్ ఎమోషన్‌ను హైలెట్ చేస్తూ, మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను పర్ఫెప్ట్ గా మిక్స్ చేసిన ఈ సినిమా, మొదటి రోజే మంచి ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. కళ్యాణ్ రామ్ నటన, విజయశాంతి పవర్‌పుల్ క్యారెక్టర్ తో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో చూపిన ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియాలోనూ సినిమాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లైమాక్స్ పార్ట్, విజయశాంతి పాత్రలో చూపిన కొత్తదనం, కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్‌లపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మరో సక్సెస్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కలెక్షన్ల విషయానికొస్తే, రెండవ రోజూ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.
మొదటి రెండు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ.8.55 కోట్లు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తొలి రోజు కంటే రెండవ రోజు కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, ఆదివారం కలెక్షన్లలో మళ్లీ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా బుక్ మై షో టికెట్ పోర్టల్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. సాయీ మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, పృథ్వి వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం అందించింది. ఓవరాల్‌గా చూస్తే, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రెండవ రోజు కూడా థియేటర్లలో మంచి టాక్ తో దూసుకెళ్తోంది. పాజిటివ్ టాక్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా వర్కింగ్ డేస్‌లోనూ సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.