అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'.
By: Tupaki Desk | 19 April 2025 11:26 AM ISTనందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. విజయశాంతి, కళ్యాణ్ రామ్ వంటి ఇద్దరు పవర్ఫుల్ నటీనటుల కాంబినేషన్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్ వంటి వారు ముఖ్యపాత్రల్లో నటించడంతో మరింత ఆసక్తి పెరిగింది.
దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కూడా తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపుని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తొలి రోజే భారీ కలెక్షన్స్ సాధించింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లతో పాటు సింగిల్ స్క్రీన్స్‌లోనూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా రూ. 5.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, అద్భుతమైన ఆరంభాన్ని నమోదు చేసింది.
5.15 కోట్ల రూపాయలతో మొదటి రోజు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్. ఓవర్సీస్ మార్కెట్లలోనూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మంచి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియాల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ పొందింది. ఇదంతా సినిమా కంటెంట్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లకు దక్కిన ప్రతిఫలం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
సినిమాలోని తల్లి కొడుకు ఎమోషనల్ సీన్లు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యాయి. విజయశాంతి తనదైన నటనతో మరోసారి రాణించింది. కళ్యాణ్ రామ్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని మెప్పించింది. అలాగే సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్లైమాక్స్ లో ట్విస్టులు, ఆసక్తికరమైన కథనం సినిమాను రిపీట్ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పిస్తున్నాయి.
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తొలి రోజు సాధించిన విజయం చూసి ట్రేడ్ నిపుణులు సినిమా భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. తొలి రోజు నుంచే పాజిటివ్ మౌత్ టాక్, స్ట్రాంగ్ ప్రమోషన్లతో సినిమా మరిన్ని రోజులు నిలబడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రెండో రోజు ప్రీ బుకింగ్స్‌లో కూడా మంచి ట్రెండ్ కనిపిస్తోంది. మొత్తంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకు మంచి రన్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్ తో పాటు వచ్చే వారాల్లోనూ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే పోటీగా కూడా ఇతర సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద మరింత కలిసొచ్చే అంశం.