అబ్బాయిలూ బీ రెడీ.. ముసుగులో ఎంజాయ్ చేయడానికి వస్తున్న స్టార్ హీరోయిన్!
పరదా మూవీ కాబట్టి ఇప్పటి వరకు పరదా వేసుకొని ఏదైనా ప్రమోషన్ చేశారా? అని అడగగా.. "రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పరదా వేసుకొని ప్రమోషన్ చేశాను.
By: Madhu Reddy | 13 Aug 2025 3:24 PM ISTఅనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేస్తున్న పరదా మూవీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అనుపమ కూడా వెరైటీ ప్రమోషన్స్ చేస్తూ పరదా మూవీపై అందరి కన్ను పడేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ పరదా వేసుకొని చార్మినార్ చుట్టూ తిరుగుతానంటూ చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో అనుపమ ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం..
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేస్తున్న పరదా మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించడం అంత సులువేమీ కాదని, ఈ క్యారెక్టర్ కోసం ఎంతో కష్టపడ్డానంటూ అనుపమ పరమేశ్వరన్ తాను పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకొస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. అందులో భాగంగానే.. మీరు చాలా వెరైటీ ప్రమోషన్స్ చేస్తున్నారు పరదా మూవీ కోసం అని ఇంటర్వ్యూవర్ అడగగా.. అవును నాకు ఇలాంటి ప్రమోషన్స్ చేయడం చాలా ఇష్టం అని చెప్పింది.
పరదా మూవీ కాబట్టి ఇప్పటి వరకు పరదా వేసుకొని ఏదైనా ప్రమోషన్ చేశారా? అని అడగగా.. "రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పరదా వేసుకొని ప్రమోషన్ చేశాను. కానీ నాకూ అందరిలాగే ఫ్రీ బర్డ్ లాగా చార్మినార్ చుట్టూ తిరిగి చక్కర్లు కొట్టాలని ఉంటుంది. అయితే ఇప్పుడు నా కోరిక తీర్చుకోబోతున్నాను. పరదా వేసుకొని చార్మినార్ పూర్తిగా చుట్టేస్తాను. రేపటినుండి పరదా వేసుకొని నా ప్రమోషన్స్ మొదలు పెడతాను" అంటూ అనుపమా చెప్పింది.
అయితే అనుపమ మాట్లాడిన ఈ మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ చార్మినార్ చుట్టూ ఉన్న అబ్బాయిలు రెడీగా ఉండండిరా.. మీ ఫేవరెట్ హీరోయిన్ పరదా వేసుకొని చార్మినార్ దగ్గరికి రాబోతోంది. ఒకవేళ మీకు లక్ ఉంటే ఆమె మీకు ఎదురు పడవచ్చు. పరదా వేసుకొని కనిపించిన వాళ్లను కాస్త కనిపెట్టుకోండి. ఏమో మీకు కూడా అనుపమ కనిపిస్తుంది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పరదా స్టోరీ విషయానికి వస్తే... ఊర్లో ఉండే కొన్ని సంప్రదాయాలు పూర్తిగా మగవారికి సపోర్ట్ గానే ఉంటాయి. ఆ సాంప్రదాయాల పట్ల విసిగిపోయిన అనుపమ తెలియని వాళ్ళతో లాంగ్ ట్రిప్ కి వెళుతుంది. ఆ ట్రిప్ లో అనుపమ మిస్ అవుతుంది.దాంతో ఆ ఊరిలో ఆమెకు ఓ ప్రమాదం ఎదురవుతుంది.. మరి ఆ ప్రమాదం ఏంటి..? ఊరంతా అనుపమకి ఎందుకు వ్యతిరేకంగా మారతారు.? అసలు ఈ పరదా స్టోరీ ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ మూవీ ఆగస్టు 22న విడుదల కాబోతోంది.
ఇకపోతే ఇటీవల ఈ సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లడానికి మేకర్స్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే డైరెక్టర్ ఆడియన్స్ కి డైరెక్ట్ సవాల్ విసురుతూ.. రివ్యూ చూసాకే సినిమాకి రండి అని చెబుతున్నారు.. ముఖ్యంగా తనకు డబ్బు అవసరమని , పేరు కాదు అని కూడా ఆయన స్పష్టం చేశారు.