Begin typing your search above and press return to search.

కూలీ, కింగ్డమ్‌... అతడి ఫ్యాన్స్‌కి పండగే!

సౌత్‌ లో స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో అనిరుధ్‌ రవిచంద్రన్‌ ముందు వరుసలో ఉంటాడు.

By:  Tupaki Desk   |   8 July 2025 6:00 PM IST
కూలీ, కింగ్డమ్‌... అతడి ఫ్యాన్స్‌కి పండగే!
X

సౌత్‌ లో స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో అనిరుధ్‌ రవిచంద్రన్‌ ముందు వరుసలో ఉంటాడు. తమిళ్‌ సినిమాలతో సంగీత దర్శకుడిగా కెరీర్‌ ఆరంభించిన అనిరుధ్ తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లోనూ అడుగు పెట్టాడు. తెలుగు ప్రేక్షకులు అనిరుధ్ సంగీతాన్ని అర్థం చేసుకునేందుకు, అలాగే తెలుగు ప్రేక్షకుల అభిరుచిని అనిరుధ్‌ అర్థం చేసుకునేందుకు సమయం పట్టింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు అనిరుధ్‌ అందించిన సంగీతం సూపర్‌ హిట్‌గా నిలిచింది. స్టార్‌ హీరోల సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచంద్రన్‌ కొనసాగుతున్నాడు. ఒక వైపు కోలీవుడ్‌, మరో వైపు టాలీవుడ్‌ సినిమాలతో అనిరుధ్‌ బిజీ బిజీగా ఉన్నాడు.

ఏడాదికి అర డజనుకు పైగా సినిమాలతో అనిరుధ్‌ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే రెండు వారాల గ్యాప్‌తో ఎప్పుడూ అనిరుధ్ తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈసారి కేవలం రెండు వారాల గ్యాప్‌తో అనిరుధ్‌ రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ రెండు సినిమాల్లో మొదటిది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కూలీ సినిమా కాగా, రెండోది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్‌. ఈ రెండు సినిమాలు చాలా తక్కువ గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కింగ్డమ్‌ సినిమాను జులై 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సితార నాగ వంశీ నిర్మించిన కింగ్డమ్‌ సినిమా నుంచి ఇప్పటి వరకు పెద్దగా పాటలు ఏమీ రాలేదు. అయితే సినిమా విడుదల తర్వాత మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్‌ టాక్ ను సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రమే కాకుండా రెగ్యులర్‌ ప్రేక్షకులు సైతం కింగ్డమ్‌ సినిమా మ్యూజిక్‌ పై చాలా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఇక కూలీ సినిమా మ్యూజిక్ విషయంలో అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ రెండు సినిమాలకు తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే అవకాశాలు ఉన్నాయి.

అనిరుధ్‌ గత ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలోని పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ సైతం ఆకట్టుకుంది. అందుకే ఈ ఏడాదిలో రాబోతున్న కింగ్డమ్‌ సినిమా మ్యూజిక్ విషయంలోనూ ఆయన ఫ్యాన్స్‌తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక కూలీ సినిమాకు పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్న బజ్‌ కి అనుగుణంగానే సినిమాకి అనిరుధ్‌ మ్యూజిక్‌ అందించి ఉంటాడు అనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తక్కువ గ్యాప్‌లోనే రెండు సినిమాలతో అనిరుధ్‌ రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌కి పెద్ద పండగే.