'ఆంధ్ర కింగ్ తాలూకా'.. మన 'కింగ్' తో చేసుంటే..
యంగ్ హీరో రామ్.. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 15 May 2025 3:43 PM ISTయంగ్ హీరో రామ్.. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. న్యూ ఏజ్డ్ స్టోరీగా హై ఎనర్జీతో రూపొందుతున్న ఆ సినిమాకు యువ దర్శకుడు పి. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.
అయితే రీసెంట్ గా ఉపేంద్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. స్టోరీ లైన్ పై క్లారిటీ ఇచ్చారు. సినిమా కథలో ఉపేంద్ర హీరో కాగా.. రామ్ ఆయన ఫ్యాన్ సాగర్ గా కనిపించనున్నారు. అందుకే మూవీ ట్యాగ్ లైన్ ను బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అంటూ ఇచ్చారు మేకర్స్.
సాగర్ అనే ఫ్యాన్ లైఫ్ స్టోరీ ఇది.. ఎప్పుడూ అభిమానులు సినిమాను ఆరాధిస్తారు, కానీ ఈ మూవీ మాత్రం అభిమానులనే ఆరాధిస్తుంది అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో సినిమాలో ఉపేంద్ర పాత్ర ఎంత కీలకమో అందరికీ అర్థమైపోయింది. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ స్టార్ట్ అయిందని చెప్పాలి.
హీరో(సినిమా స్టోరీలో) రోల్ కోసం ఉపేంద్రను సెలెక్షన్ పై జోరుగా డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి.. ఆయన రోల్ కోసం మాలీవుడ్ నుంచి స్టార్ హీరోను రంగంలోకి మేకర్స్ దించుతారని కొద్ది రోజుల క్రితం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ.. మేకర్స్ మాత్రం ఫైనల్ గా ఉపేంద్రను ఫిక్స్ చేశారు.
కానీ ఉపేంద్ర బదులు టాలీవుడ్ సీనియర్ అండ్ బడా హీరోలు, తెలుగు ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలైన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునల్లో ఎవరో ఒకర్ని పెట్టి తీస్తే బాగుండేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలా అని ఉపేంద్రను అసలు తక్కువ చేయడం కాదని, ఆయన యాక్టింగ్ కోసం మన అందరీ తెలుసని చెబుతున్నారు.
సినిమా స్టోరీలో హీరో రోల్ కనుక.. మన టాలీవుడ్ హీరో అయితే తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వెంకటేష్, నాగార్జునల్లో ఒకరితో చేయాల్సిందని కామెంట్స్ పెడుతున్నారు. అప్పుడు మూవీ రిలీజ్ కు ముందే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యేదని అంచనా వేస్తున్నారు.
అందులో నాగార్జునకు కింగ్ అనే బిరుదు ఉన్న విషయం తెలిసిందే. దీంతో టైటిల్ కు పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అలా ఇప్పుడు సోషల్ మీడియాలో తమ తమ ఫీలింగ్స్ ను షేర్ చేసుకుంటున్నారు అనేక మంది నెటిజన్లు. ఏదేమైనా ఏ రోల్ ఎవరికి రాసి ఉంటే.. వారికే దక్కుతుంది.. వారే చేస్తారు.. ఇది మాత్రం నిజం. మరి ఉపేంద్ర తన రోల్ లో ఎలా అలరిస్తారో వేచి చూడాలి.