పవన్ తో క్లోజ్ గా ఉన్నందుకే త్రివిక్రమ్ ను దూరం పెడుతున్నాడా?
సోషల్ మీడియా బాగా పెరిగిన నేపథ్యంలో ప్రతీదీ ఓ సెన్సేషన్ వార్తైపోతుంది ఈ రోజుల్లో. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మెగా అల్లు కాంపౌండ్ గురించి మరో కొత్త వార్త పుట్టుకొచ్చింది.
By: Tupaki Desk | 29 April 2025 8:56 PM ISTసోషల్ మీడియా బాగా పెరిగిన నేపథ్యంలో ప్రతీదీ ఓ సెన్సేషన్ వార్తైపోతుంది ఈ రోజుల్లో. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మెగా అల్లు కాంపౌండ్ గురించి మరో కొత్త వార్త పుట్టుకొచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పవన్ కళ్యాణ్ కు ఉన్న వివాదం వల్ల బన్నీ వాసును పవన్ కళ్యాణ్ పక్కన పెడుతున్నాడని ఓ వర్గం అంటుండగా, దానికి ప్రతీకారంగా బన్నీ కూడా త్రివిక్రమ్ ను దూరంగా ఉంచుతున్నాడని మరికొందరు అంటున్నారు.
అలా అని ఏదీ పూర్తి నిజం కాదు. నిజమేంటనేది పక్కన పెడితే ఈ వార్తలు ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ కథ చెప్పి చాలా కాలమే అవుతుంది. అల వైకుంఠపురములో తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమాను కూడా అనౌన్స్ చేశారు. కానీ పుష్ప2 వల్ల వీరి కాంబోలో మూవీ లేటవుతూ వచ్చింది.
పుష్ప2 అయిపోయిందిలే ఇక బన్నీ- త్రివిక్రమ్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుందనుకునే టైమ్ కు బన్నీ అట్లీ తో ముందుగా సినిమా చేయడానికి ప్రాధాన్యతనిచ్చి ఆ సినిమాపై వర్క్ చేస్తున్నాడు. ఆల్రెడీ అట్లీ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైన విషయం తెలిసిందే. ఎంతలేదన్నా ఈ సినిమాకు ఏడాదిన్నర పడుతుంది. అట్లీతో చేసిన సక్సెస్ అయితే బన్నీ, త్రివిక్రమ్ ను తన ఇమేజ్ కు సరిపోయేలా కథను రెడీ చేయమని చెప్పే ఛాన్సుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కాకుండా డైరెక్ట్ గా పుష్ప3 చేసే అవకాశమూ లేకపోలేదు.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ బన్నీ కోసం రాసుకున్న స్క్రిప్ట్ ఆషామాషీదేం కాదు. ఈ కథను త్రివిక్రమ్ ఎంతో గ్రాండ్ గా భారీ గ్రాఫిక్స్ అవసరమయ్యేలా రాసుకున్నాడట. కాబట్టి ఈ సినిమా పూర్తవడానికి రెండేళ్లు టైమ్ పడుతుందంటున్నారు. అయితే త్రివిక్రమ్ కు బన్నీ, అట్లీ సినిమా చేస్తూనే మధ్యలో కొన్ని రోజులు షూటింగ్ కోసం కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో త్రివిక్రమ్ ఎటూ వెళ్లలేకపోతున్నాడు. అలా అని త్రివిక్రమ్ కు బన్నీ అడిగినప్పుడల్లా డేట్స్ ఇచ్చే సిట్యుయేషన్స్ లేవు కాబట్టి ఇది కచ్ఛితంగా మాటల మాంత్రికుడి సహనానికి పరీక్షే. బన్నీ, పవన్ మధ్య ఉన్న రిలేషన్ దెబ్బతిన్న నేపథ్యంలో పవన్ తో క్లోజ్ గా ఉండే త్రివిక్రమ్ తో ముందుకెళ్లడానికి బన్నీ ఆసక్తి చూపించట్లేదని అంటున్న మాటల్లో నిజమెంతన్నది చూడాలి మరి.