ఇతడే 'ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా'?
ఆ సమయంలో జాన్వీ కపూర్ సౌతిండియన్ స్టార్ అయిన అల్లు అర్జున్ పుష్ప పాత్రను ఇమ్మిటేట్ చేస్తూ, అతడి పేరును హైలైట్ చేస్తూ, ఒక భారీ డైలాగ్ చెప్పింది.
By: Sivaji Kontham | 13 Aug 2025 9:53 AM ISTటాలీవుడ్ లో ఎందరో అగ్ర హీరోలు ఉన్నారు.. దశాబ్ధాలుగా మారుతున్న కాలంతో పాటు ప్రతి దశలోను రికార్డులు బ్రేక్ చేస్తూ సూపర్ స్టార్లుగా ఎదిగినవారున్నారు. కానీ ఇంతమంది దిగ్గజ హీరోలలో ఎవరికీ లేనంత క్రేజ్ ను, ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడు అల్లు అర్జున్. అతడు స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. వందేళ్లు పైబడిన భారతీయ సినిమా హిస్టరీలో 90ఏళ్లు పైబడిన చరిత్ర ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో `ఉత్తమ నటుడు`గా జాతీయ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి కథానాయకుడిగా అల్లు అర్జున్ రికార్డులకెక్కాడు. దీనికి తోడు `పుష్ప` ఫ్రాంఛైజీతో అతడు తనను తాను పాన్ ఇండియాలో ఎలివేట్ చేసుకున్న తీరు అసాధారణమైనది. కారణాలు ఏవైనా ఇప్పుడు అతడు `ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా` అనే గుర్తింపును పొందాడు.
మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్లు ఎందరు ఉన్నా కానీ, పుష్పరాజ్ గా అతడి నటనకు వరల్డ్ వైడ్ గొప్ప గుర్తింపునిచ్చింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా, నార్త్ లోను భారీ ఫాలోయింగ్ ని పెంచింది. పుష్ప, పుష్ప 2 సినిమాల్లో పుష్పరాజ్ గా మాస్ పాత్రలో అద్భుతంగా నటించిన బన్నీపై ప్రశంసలు కురిసాయి. ఇకపై అతడు నటించే ప్రతి సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ లో గొప్ప క్రేజ్ నెలకొంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు ఏ రేంజుకు చేరుకుంది? అంటే ఒక బాలీవుడ్ ట్రైలర్ లేదా ప్రోమోలో తెలుగు సినిమాకి ఇతడే ముఖం(ముఖ్యుడు)! అని పొగిడేంతగా.. ఈ గురువారం నాడు విడుదలైన హిందీ సినిమా `పరమ్ సుందరి` ట్రైలర్ వీక్షించాక ఆ విషయం అర్థమవుతుంది. ఇందులో కేరళ అమ్మాయిగా నటించిన జాన్వీకపూర్ తనతో ప్రేమలో ఉన్న హిందీ కుర్రాడు సిద్ధార్థ్ మల్హోత్రాకు ఫుల్ గా క్లాస్ తీస్కుంటుంది.
ఆ సమయంలో జాన్వీ కపూర్ సౌతిండియన్ స్టార్ అయిన అల్లు అర్జున్ పుష్ప పాత్రను ఇమ్మిటేట్ చేస్తూ, అతడి పేరును హైలైట్ చేస్తూ, ఒక భారీ డైలాగ్ చెప్పింది. ``కేరళ మలయాళం- మోహన్ లాల్.., తమిళనాడు తమిళ్- రజనీ కాంత్.. ఆంధ్రా తెలుగు- అల్లు అర్జున్.. కర్నాటక కన్నడ - యష్.... అందరూ దక్షిణాది స్టార్లు.. వేర్ ఈజ్ నార్త్ ఇండియన్స్..? అంటూ జాన్వీ ఉత్తరాది వారిని విమర్శించే సీన్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. టాలీవుడ్ లో ఎందరో లెజెండరీ స్టార్లు ఉన్నారు. వారందరినీ కాదనుకుని ఇలా అల్లు అర్జున్ పేరునే ఎంచుకోవడానికి కారణమేమిటి? అంటే.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరో.. యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో గనుకనే.. బాలీవుడ్ సినిమా డైలాగ్ లో అతడి పేరు ప్రముఖంగా హైలైట్ అయిందని విశ్లేషిస్తున్నారు.