బన్నీ మూడు నెలల పాటూ అక్కడే!
ఆల్రెడీ సినిమాపై మంచి హైప్ ఉండటంతో ఈ మూవీ గురించి ఎలాంటి వార్త వినిపించినా క్షణాల్లో అది నెట్టింట వైరల్ అవుతుంది. అందులో భాగంగానే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 24 Jun 2025 12:33 PM ISTపుష్ప2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అశేష గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప2తో బన్నీ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా? తనకు పుష్ప2 తో వచ్చిన క్రేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు ఎలా తీసుకెళ్తాడా అని అందరూ అనుకున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా బన్నీ తన తర్వాతి సినిమాను అట్లీ దర్శకత్వంలో అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
వాస్తవానికైతే పుష్ప2 తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సింది. ఆల్రెడీ త్రివిక్రమ్ - బన్నీ ప్రాజెక్టు అనౌన్స్ కూడా అయింది. కానీ మధ్యలో అట్లీ రావడం వల్ల బన్నీ త్రివిక్రమ్ సినిమాను పక్కన పెట్టి ముందుగా అట్లీతో సినిమా చేద్దామని డిసైడై సినిమాను అనౌన్స్ చేశాడు. అనౌన్స్‌మెంట్ తోనే అట్లీ- అల్లు అర్జున్ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఆల్రెడీ సినిమాపై మంచి హైప్ ఉండటంతో ఈ మూవీ గురించి ఎలాంటి వార్త వినిపించినా క్షణాల్లో అది నెట్టింట వైరల్ అవుతుంది. అందులో భాగంగానే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ త్వరలోనే పూర్తి కానున్నాయని, ఆ వెంటనే షూటింగ్ మొదలు కానుందని సమాచారం. మొదటి షెడ్యూల్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడు నెలల పాటూ ముంబైలోనే ఉండనున్నాడని, అల్లు అర్జున్ కెరీర్లోనే ఇది అతి పెద్ద అవుట్‌డోర్ షూటింగ్ అని తెలుస్తోంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో అట్లీ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
ఈ షెడ్యూల్ తర్వాత అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్ అంతా అమెరికా వెళ్లనుందని, అక్కడ వీఎఫ్ఎక్స్ సంబంధిత సీన్స్ ను షూట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె బన్నీ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా కోసం అట్లీ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాడని అర్థమవుతుంది.