దీపిక, మృణాల్, జాన్వీ ఒకే ప్రేమ్ లోనా?
మరో ఇద్దరు నాయికలకు కథలో అవకాశం ఉండటంతో ఛాలా మంది భామల పేర్లే తెరపైకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Jun 2025 4:00 PM ISTఐకాన్ స్టార్- అట్లీ సినిమాలో హీరోయిన్లు ఫైనల్ అయ్యారా? ముగ్గురు భామల ఎంపిక ప్రక్రియ పూర్త యిందా? అంటే అవుననే లీకులందుతున్నాయి. బన్నీ 22వ చిత్రం ముంబైలో అధికారికంగా ప్రారంభ మైన సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ మొదలైందా? లేదా? అన్నది ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అలాగే సిని మాలో హీరోయిన్లు ఎవరు ఎంపికయ్యారు? అన్నది కూడా రివీల్ చేయలేదు. అధికారి కంగా దీపికా పదు కొణే ఎంట్రీ ఒక్కటే ఖరారైంది.
మరో ఇద్దరు నాయికలకు కథలో అవకాశం ఉండటంతో ఛాలా మంది భామల పేర్లే తెరపైకి వస్తున్నాయి. జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండే ఇలా కొంత మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ తాజా సమాచారం ఏంటంటే? మరో ఇద్దరు నాయిల్ని కూడా మేకర్స్ ఖరారు చేసినట్లు తెలిసింది. మృణాల్ ఠాకూర్ ని సెకెండ్ లీడ్ కి, థర్డ్ లీడ్ లో జాన్వీ కపూర్ ని ఎంపిక చేసినట్లు వినిపిస్తుంది.
అట్లీ ఇద్దరిపై టెస్ట్ షూట్ నిర్వహించి ఎంపిక చేసాడుట. ఇదే నిజమైతే తెరంతా అందాల జాతరే. దీపిక, మృణాల్, జాన్వీ కపూర్ ఒకే ప్రేమ్ లో కనిపిస్తే ఆ రచ్చ ఎలా ఉంటుందో ఊహకే అందదు. ఇంత వరకూ ఈ త్రయం కలిసి నటించింది లేదు. వీళ్లిద్దరికంటే దీపిక సీనియర్. స్టార్ డమ్ పరంగానూ తిరుగులేని నాయిక. కానీ పెర్పార్మెన్స్ లో మాత్రం మృణాల్ కి పోటీ కాదు. నటిగా మృణాల్ కే ఎక్కువ మార్కులు పడతాయి.
జాన్వీ కపూర్ తో పోలికి చేసినా? అదే పరిస్థితి. అందుకే మృణాల్ ని సెకెండ్ లీడ్ లో పెట్టినట్లు తెలు స్తోంది. కానీ క్రేజ్ పరంగా చూస్తే జాన్వీ కపూర్ కంటే ఓ మెట్టు కిందనే ఉంటుంది మృణాల్. మరి ఈ సినిమాలో ఈ ముగ్గుర్నీ అట్లీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? అన్నది చూడాలి. హీరోయిన్లను అందంగా చూపిం చడంలో అట్లీ ఎక్స్ పర్ట్ కాదు. హీరోయిన్ల పాత్రలకు స్కోప్ పర్వాలేదు. మరీ పాటలకే పరిమితం చేయడం.