Begin typing your search above and press return to search.

అట్లీ - బన్నీ.. ప్లాన్ ఎలా సాగుతోందంటే..

అల్లు అర్జున్ అట్లీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎవరు హీరోయిన్? కథ ఏమిటి? అనే సందేహాలకు జవాబుల కోసం అభిమానులు తహతహలాడుతున్నారు.

By:  Tupaki Desk   |   29 April 2025 8:56 PM IST
Huge Casting In Allu Arjun And Atlee Movie
X

అల్లు అర్జున్ అట్లీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎవరు హీరోయిన్? కథ ఏమిటి? అనే సందేహాలకు జవాబుల కోసం అభిమానులు తహతహలాడుతున్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ నుంచి వస్తున్న ఈ సినిమా నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ ప్రాజెక్ట్ కానుంది. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్ర రూ.600–700 కోట్ల బడ్జెట్‌తో రూపొందనుందనే మాట ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. దీనికి తగ్గట్టే వీఎఫ్ఎక్స్, ప్రోస్తెటిక్స్ విషయంలో హాలీవుడ్ స్థాయిలో ప్లానింగ్ సాగుతోందట.

లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు గ్లోబల్ లెవెల్ బాక్డ్రాప్‌తోపాటు, ముగ్గురు ప్రధాన కథానాయికలు ఉంటారని సమాచారం. అంతేకాక, ఇంకా ఇద్దరు కథానాయికలు సపోర్టింగ్ రోల్స్ లో కనిపించనున్నారని టాక్. ప్రస్తుతం అట్లీ బృందం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ నుండి కూడా నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంది. అందరి డేట్లు, రెమ్యునరేషన్ చర్చలు నడుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే మృణాల్ ఠాకూర్, సమంత పేర్లు రెండు కీలక పాత్రల కోసం ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధాన హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇటీవల సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఏ అప్‌డేట్ రాకపోవడంతో, ఆమె ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారా లేదా అనేది మరోసారి చర్చకు దారి తీసింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రానికి సంబంధించి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు ఒక దశలో వినిపించింది. కానీ రాజమౌళి – మహేష్ బాబు సినిమా, క్రిష్ 4, హాలీవుడ్ కమిట్‌మెంట్స్ వంటి కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ఇండస్ట్రీ టాక్. ప్రియాంక స్థానంలో మరొక ఇంటర్నేషనల్ స్టార్‌కి అవకాశం ఇవ్వాలని బన్నీ – అట్లీ టీమ్ ఆలోచనలో ఉన్నట్టు టాక్.

ఈ సినిమా కథలో ఫాంటసీ ఎలిమెంట్స్, స్పేస్ బ్యాక్‌డ్రాప్, ఇతర గ్రాఫిక్ క్రియచర్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ పనులకు ఇప్పటికే హాలీవుడ్ సంస్థలతో ఒప్పందాలు పూర్తయ్యాయని సమాచారం. అట్లీ మొదటి సారిగా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్న కథను డైరెక్ట్ చేయబోతున్నాడు. బన్నీ అయితే ఈ స్క్రిప్ట్ విని వెంటనే ఓకే చెప్పినట్టు తెలిసింది.

మొత్తంగా చూస్తే బన్నీ అట్లీ సినిమా అనౌన్స్‌మెంట్ తరువాత మళ్లీ పెద్ద అప్‌డేట్ ఏదీ రాకపోయినా, క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ చుట్టూ సాగుతున్న పనుల రేంజ్ చూస్తే ఇది ఇండియన్ స్క్రీన్ మీద మరో డిఫరెంట్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్న ప్రాజెక్ట్ అని స్పష్టమవుతుంది. పూర్తిస్థాయి క్యాస్ట్ అండ్ క్రూ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశముందట. ఇప్పటికే ముంబైలో పూజా కార్యక్రమాలతో సినిమా పనులు స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. మరి నెక్స్ట్ అప్డేట్ సినిమాపై ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.