Begin typing your search above and press return to search.

ఆ కన్ను అప్పుడప్పుడు కొట్టుకుంటుందా.. దానర్ధం ఏంటో..?

ఐతే ఈమధ్య మీడియాలో గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ వాసు బయటకు వెళ్తున్నాడు అన్న వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   29 April 2025 6:19 PM IST
ఆ కన్ను అప్పుడప్పుడు కొట్టుకుంటుందా.. దానర్ధం ఏంటో..?
X

నిర్మాణ సంస్థల్లో అల్లుకున్న పొగ కనిపెట్టి ఫలానా వారి మధ్య ఇది జరుగుతుంది అంటూ కొందరు చేసే హంగామా తెలిసిందే. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్, ప్రొడ్యూసర్స్ మధ్య జరిగే విషయాల గురించి మీడియాలో రకరకాలుగా రాస్తుంటారు. అక్కడ జరిగింది ఏమో కానీ మీరనుకుంటున్నట్టు అలాంటిది ఏమి లేదని మళ్లీ వాళ్లే చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అలాంటి ఒక పరిస్థితి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి వచ్చింది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పెద్ద సినిమాలను ఆయన నిర్మిస్తూ గీతా ఆర్ట్స్ 2 అంటూ మీడియం రేంజ్, లో బడ్జెట్ సినిమాలను బన్నీ వాసుని ముందుంచి నడిపిస్తున్నారు. బన్నీ వాసు కూడా అల్లు అరవింద్ పెట్టిన బాధ్యతను చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఈమధ్యనే బన్నీ వాసు నిర్మాణంలో నాగ చైతన్య తండేల్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఐతే ఈమధ్య మీడియాలో గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ వాసు బయటకు వెళ్తున్నాడు అన్న వార్తలు వచ్చాయి.

దానికి వివరణగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కి బన్నీ వాసు, విద్య రెండు కళ్లలాంటి వారని అన్నారు. ఐతే అల్లు అరవింద్ ఆ మాట చెప్పగానే బన్నీ వాసు మైక్ తీసుకుని అందులో పెద్ద కన్ను నేనే అన్నారు. దానికి సమాధానంగా అల్లు అరవింద్ అప్పుడప్పుడు ఆ కన్ను కొట్టుకుంటుంది అని అన్నారు. గీతా ఆర్ట్స్ లో తాను పెద్ద కన్ను అని బన్నీ వాసు చెప్పడమే అవును కానీ అది అప్పుడప్పుడు కొట్టుకుంటుంది అని చెప్పడం వెనక అల్లు అరవింద్ ఆలోచన ఏంటో అని అనుకుంటున్నారు.

బన్నీ వాసు గీతా ఆర్ట్స్ లో రెండు దశాబ్దాలుగా చేస్తున్నాడు. సో ఆయన అంత ఈజీగా అందులోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఐతే సినిమా నిర్మాణం పట్ల అల్లు అరవింద్ కి ఉన్న అనుభవం తో బన్నీ వాసు ఇంకా తన దగ్గర పనిచేసే నిర్మాతల మీద అప్పుడప్పుడు అల్లు అరవింద్ అసంతృప్తిని వ్యక్తం చేస్తారన్న టాక్ ఉంది. సో ఆ విషయాన్నే కాస్త పెద్దదిగా చేసే ప్రయత్నం చేశారు. కానీ బన్నీ వాసు గీతా ఆర్ట్స్ నుంచి ఎక్కడికి వెళ్లడు అన్నట్టుగా అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ బ్యానర్ నుంచి రాబోయే ఐదేళ్లలో భారీ సినిమాలు రాబోతున్నాయని చెప్పారు అల్లు అరవింద్.