Begin typing your search above and press return to search.

అల్లరోడు రొమాంటిక్‌ మూడ్‌లోకి వెళ్తున్నాడా ఏంటి?

అల్లరి నరేష్‌ మళ్లీ కామెడీ ట్రాక్‌లో పడుతున్నాడు. 2015 వరకు వరుసగా కామెడీ సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఆ తర్వాత కాస్త జోరు తగ్గించాడు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 8:00 PM IST
అల్లరోడు రొమాంటిక్‌ మూడ్‌లోకి వెళ్తున్నాడా ఏంటి?
X

అల్లరి నరేష్‌ మళ్లీ కామెడీ ట్రాక్‌లో పడుతున్నాడు. 2015 వరకు వరుసగా కామెడీ సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఆ తర్వాత కాస్త జోరు తగ్గించాడు. మూస కామెడీ అంటూ చాలా మంది కొట్టి పడేయడంతో అల్లరోడు కొత్త రూట్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఆ క్రమంలో నాంది, బచ్చలమల్లి వంటి సినిమాలు చేశాడు. నాంది సినిమా పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత వచ్చిన సీరియస్ పాత్రలు ఆకట్టుకోలేకపోయాయి. దాంతో అల్లరి నరేష్ మళ్లీ కామెడీ జోనర్‌ వైపు అడుగులు వేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే తగ ఏడాదిలో ఆయన నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆకట్టుకోలేక పోయింది.

ఆ ఒక్కటి అడక్కు సినిమా బాక్సాఫీస్‌ వద్ద తీవ్రంగా నిరాశ పరచడంతో అల్లరోడు కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. తిరిగి ఫామ్‌లోకి రావాలంటే కామెడీ సినిమాలే చేయాలి, కానీ కాస్త ఈతరం ప్రేక్షకులకు తగ్గట్లుగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే కథలు ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే నరేష్ తన కొత్త సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. 'రంభ ఊర్వశి మేనక' అనే టైటిల్‌తో అల్లరి నరేష్‌ కొత్త సినిమా రాబోతుంది. టైటిల్‌ను చూస్తూ ఉంటే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారేమో అనిపిస్తుంది. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

గతంలో అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల జోనర్‌లో ఈ సినిమా ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు శర్వానంద్‌తో రాధ అనే సినిమాను రూపొందించిన దర్శకుడు చంద్ర మోహన్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. చంద్రమోహన్‌ చెప్పిన కథ నచ్చడంతో అల్లరి నరేష్‌ వెంటనే ఓకే అన్నాడని, కథ విషయం మాత్రమే కాకుండా టైటిల్‌ కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రస్తుతం చివరి దశ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుతున్నట్లు మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. ఈ సినిమాను రెండు నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.

ఈ మధ్య కామెడీ సినిమాలకు బాగానే ఉంటుంది. కానీ కామెడీ అనేది న్యూ ఏజ్‌ గా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది. అందుకు తగ్గట్టుగా సినిమా కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో రానటువంటి కామెడీ జోనర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. అయితే టైటిల్‌ ఎందుకు అలా పెట్టారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం అల్లరోడు కామెడీ, సీరియస్‌ తర్వాత ఇప్పుడు రొమాన్స్ మూడ్‌లోకి వెళ్తున్నాడా ఏంటి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాలి అంటే చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. మేకర్స్ నుంచి ఈ సినిమా గురించి త్వరలోనే ప్రకటన వస్తుందేమో చూడాలి.