Begin typing your search above and press return to search.

తెలుగు మూవీలో అలియా.. స్టోరీ వెనుక ఇంట్రెస్టింగ్ కథ!

బీ టౌన్ లో స్టార్ హీరోయిన్ గా కొంతకాలంగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ సౌత్ సినిమాల్లో నటించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుందనే చెప్పాలి

By:  M Prashanth   |   14 Aug 2025 4:00 AM IST
తెలుగు మూవీలో అలియా.. స్టోరీ వెనుక ఇంట్రెస్టింగ్ కథ!
X

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తెలుగు సినీ ప్రియులకు కూడా సుపరిచితురాలే. బీ టౌన్ లో స్టార్ హీరోయిన్ గా కొంతకాలంగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ సౌత్ సినిమాల్లో నటించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుందనే చెప్పాలి. ఇప్పటికే తెలుగులో ఆర్ఆర్ఆర్ మూవీతో సందడి చేసిన విషయం తెలిసిందే.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో తన యాక్టింగ్ తో సీతగా మెప్పించింది. మూవీలో ఆలియా కనిపించేది కొద్దిసేపే అయినా ఆడియన్స్ ను ఫిదా చేసిందనే చెప్పాలి. ఇప్పుడు తెలుగులో మరో మూవీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యంగ్ అడల్ట్ మూవీలో నటించనుంది అమ్మడు.

18 ప్లస్ వాళ్లు చూసే కంటెంట్ తో రూపొందే ఆ సినిమా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానుంది. కళాశాల వాతావరణంలో కొత్త క్యాస్టింగ్ తో ఫ్రెష్ గా తీయబోతున్నారని సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ గా రూపొందనున్న ఆ మూవీకి నిర్మాతల్లో ఒకరిగా కూడా ఆలియా భట్ వ్యవహరించనుంది.

ఎటర్నల్ సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించనుండగా, చాక్ బోర్డు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సహా నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది. శ్రీతి ముఖర్జీ దర్శకురాలిగా పరిచయం అవ్వనున్నారు. వార్-2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ బంధువు అయిన ఆమె.. ఇప్పుడు ఆలియా భట్ తో డెబ్యూ మూవీ చేస్తుండడం విశేషం.

అయితే అలియా- శ్రీతి కాంబినేషన్ లో రానున్న సినిమా కథ వెనుక ఇంట్రెస్టింగ్ కథ ఉందని తెలిసింది. నిజానికి అలియా భర్త, స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన వేక్ అప్ సిద్ మూవీ అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఆ మూవీ కథను అమ్మాయిల కోణంలో, కాస్త బోల్డ్ గా చెబితే బాగుంటుందని శ్రీతి ముఖర్జీకి చెప్పిందట అలియా.

దీంతో ఇంకేముంది.. శ్రీతికి కాన్సెప్ట్ నచ్చి స్టోరీని డెవలప్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు అలియా.. ఆ కథతో తీయనున్న సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. తెలుగు సహ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది ఆ చిత్రం. అదే సమయంలో మరిన్ని మూవీల్లో నటిస్తూ అలియా బిజీగా ఉంది. చాముండా మూవీలో యాక్ట్ చేస్తున్నారు. కల్కి 2లో కూడా నటించనున్నారని టాక్ వస్తోంది. మరి అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.