గుండబ్బాయిగా స్టార్ హీరో.. ఇదేమి లుక్కు తలా?
తమిళ నటులలో తనదైన మార్క్‌తో సాగుతున్న స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ గా ఓ కొత్త లుక్‌తో కనిపించి అందర్నీ షాక్‌కు గురిచేశాడు.
By: Tupaki Desk | 24 Jun 2025 3:23 PM ISTతమిళ నటులలో తనదైన మార్క్‌తో సాగుతున్న స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ గా ఓ కొత్త లుక్‌తో కనిపించి అందర్నీ షాక్‌కు గురిచేశాడు. సాధారణంగా స్టైలిష్ గెటప్‌లతో కనిపించే అజిత్ ఈసారి పూర్తిగా గుండబ్బాయి గా కనిపిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. 'బేబీ కటింగ్' స్టైల్‌గా పిలిచే ఈ గుండు లుక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం అజిత్ తన రెండో ప్యాషన్ అయిన రేసింగ్‌ను పూర్తి స్థాయిలో కొనసాగిస్తున్నాడు. బెల్జియంలోని ప్రసిద్ధ స్పా ఫ్రాంకోచాంప్స్ రేసింగ్ సర్క్యూట్‌లో రేసింగ్ సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్ ఈ లుక్‌లో కనిపించాడు. అజిత్ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయినప్పటికీ, మధ్యలోనే ఓ ప్రత్యేకమైన బ్రేక్ తీసుకొని విదేశాల్లో రేసింగ్‌లో పాల్గొనడం ఆయన ప్యాషన్‌కు నిదర్శనం.
ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అజిత్ మళ్లీ అదే దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కొత్త సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. అజిత్ గెటప్ చూస్తుంటే ఇది ఆ ప్రాజెక్ట్ కోసమేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈసారి ఓ సైనిక నేపథ్యమా? లేక స్ట్రిక్ట్ పోలీస్ గెటప్‌లా ఏదైనా రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ కోసం ఇలా ట్రై చేస్తున్నారా? అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్‌లో కలుగుతుంది.
ఈ గుండతల లుక్‌తో పాటు అజిత్ ధరించిన డార్క్ షేడ్స్ గ్లాసెస్, నేవీ బ్లూ జాకెట్‌లో కనిపించిన విధానం కూడా ఫ్యాషన్ లవర్స్‌ని ఆకట్టుకుంది. సాధారణంగా సెలబ్రిటీస్ ఇలాంటివి షూటింగ్ సమయంలో మాత్రమే చేస్తారు. కానీ అజిత్ మాత్రం నిజ జీవితంలోనూ తన లుక్‌పై ఈ స్థాయిలో ప్రయోగాలు చేయడం విశేషం.
ఇప్పటికే ఈ లుక్‌తో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం తలా మళ్లీ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు, ఇది మామూలు సినిమాకాదులే.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అజిత్ రేసింగ్ పూర్తిచేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ షురూ అయ్యే అవకాశముంది. మరి ఈ గెటప్ వెనుక అసలు కథేంటి అనేది అధికారిక ప్రకటన రాగానే తెలుస్తుంది.