మూడో పెళ్లిపై అమీర్ ఖాన్ మెలిక..!
అయితే గౌరీని అమీర్ ఖాన్ ఎప్పుడు పెళ్లాడుతాడు? పెళ్లి ఘడియలు వచ్చినట్టేనా? ఈ ప్రశ్నకు డౌట్స్ క్లియర్ చేసాడు అమీర్.
By: Tupaki Desk | 8 July 2025 10:52 PM ISTలేటు వయసులో ఘాటు ప్రేమాయణంతో నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తున్నాడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. షష్ఠిపూర్తి వయసులో అతడు తన కంపెనీ ఉద్యోగి గౌరీ స్ప్రాట్ తో ప్రేమలో మునిగాడు. ఈ జంట ఇప్పటికే కలిసి ప్రతి ముఖ్యమైన ఈవెంట్లలో పాల్గొంటోంది. అమీర్- గౌరీ మధ్య కెమిస్ట్రీ ఎక్కువగా చర్చల్లోకొస్తోంది.
అయితే గౌరీని అమీర్ ఖాన్ ఎప్పుడు పెళ్లాడుతాడు? పెళ్లి ఘడియలు వచ్చినట్టేనా? ఈ ప్రశ్నకు డౌట్స్ క్లియర్ చేసాడు అమీర్. ఆమెతో ఇప్పటికే పెళ్లయిపోయిందని అతడు అన్నాడు. ``గౌరీ- నేను ఒకరి విషయంలో ఒకరు చాలా సీరియస్ గా ఉన్నాం. మేం కలిసే ఉంటున్నాం.. మేం ఇప్పుడు భాగస్వాములం అని అన్నాడు. మేం మానసికంగా కలిసే ఉన్నాం. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో మునుముందు ప్రయాణంలో నిర్ణయించుకుంటాను! అని అమీర్ ఖాన్ అన్నాడు.
అంతేకాదు.. గతంలో రాజ్ షమణి ఇంటర్వ్యూలో తాను వృద్ధుడిని అయిపోయానని, తనకు మూడో పెళ్లి మూడ్ లేదని ఒప్పుకున్న అతడు ఇకపై పెళ్లాడనని అన్నాడు. అయితే ఆ తర్వాత థెరపీ చేయించుకుని దీని నుంచి బయటపడ్డానని చెప్పాడు. అమీర్ ఖాన్ తొందర్లోనే గౌరీని పెళ్లాడతాడనే అందరూ అనకుంటున్నారు. దీనిని అతడు అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాడో వేచి చూడాలి.