మాకు ఓటేయకపోతే.. అమెరికానే నష్టపోయింది: ట్రంప్
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ తగిలినా అధ్యక్షుడు ట్రంప్ ఓటమిని అంగీకరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తన పార్టీకి ఓటు వేయకపోవడంతో అమెరికానే నష్టపోయిందని, స్టాక్ మార్కెట్ పడిపోయిందని వ్యాఖ్యానించారు. ట్రంప్ విధానాలే రిపబ్లికన్ల పరాజయానికి కారణమన్న విమర్శల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
By: Garuda Media | 9 Nov 2026 12:11 PM IST`కింద పడ్డా చేయి పైకి పెట్టాను కాబట్టి.. గెలుపు నాదే` అనే టైపు నాయకులు రాజకీయాల్లో ఇటీవల కాలంలో కనిపి స్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏసమయానికి ఎలాంటి కామెంట్లు చేస్తారో చెప్పలేం. ఆయన మాట. నిర్ణయానికి కూడా నిలకడలేదని అంటారు. తాజాగా జరిగిన ఇంటీరియమ్ ఎలక్షన్స్‌లో అధికారి రిపబ్లికన్ పార్టీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, పెరిగిన చమురు ధరలు.. నిరుద్యోగం ఇలా.. అనేక అంశాలపై అమెరికన్లు ఆగ్రహంతో ఉన్నారు.
ఈ ఆగ్రహాన్ని తాజాగా జరిగిన ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ప్రజలు తేల్చి చెప్పారు. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా రిపబ్లిక న్‌లకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లోని సెనేట్‌లు, రిప్రజెంటేటివ్స్ వంటివి డెమొక్రాట్ల వశమయ్యాయి. సో.. ఈ ప్రభావం సహజంగానే మరోసారి అధ్యక్షుడు కావాలని కలలు కంటున్న ట్రంప్‌కు ఇబ్బందిగానే ఉన్నాయి. నిజానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఏ వ్యక్తికైనా రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ట్రంప్ ఈ దఫా గెలిచి ఉంటే(రిపబ్లికన్లు చిత్తుగా ఓడారు) రాజ్యాంగాన్ని సవరించాలని అనుకున్నారు.
ఇక, తాజా ఎన్నికల ఫలితం తీవ్ర వ్యతిరకంగా వచ్చి.. ప్రజల్లో తనపై ఆగ్రహం వ్యక్తమవుతున్నట్టు స్పష్టమైనా.. ట్రంప్ మాత్రం ఈ ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్నారు. డెమొక్రాట్లు పైచేయి సాధించారు కదా.. అని ఎవరైనా అంటే అంతెత్తున ఎగిరి పడుతున్నారు. తాజాగా ఆయనను మీడియా కార్నర్ చేసింది. ట్రంప్ విధానాలు.. ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాల ప్రభావంతోనే రిపబ్లికన్లు దెబ్బతిన్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పెద్ద వ్యాసం ప్రచురించింది. దీనిపై పరోక్షంగా నిప్పులు చెరిగిన ట్రంప్.. కీలక వ్యాఖ్యలు చేశారు.
``రిపబ్లికన్‌లకు ఓటు వేయకపోవడం వల్ల.. మాకు నష్టం ఏమీ లేదు. అమెరికానే పతనం అయింది. చూడండి.. మా వాళ్లకు ప్రజలు ఓటేయలేదు(ఓడారు అన్నమాట వాడలేదు) కాబట్టే.. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ కూలిపోయింది. అదే మాకు వేయాలని కోరాం. సో.. మాకన్నా.. అమెరికానే నష్టపోయింది. ఇది ప్రజలు ఆలోచన చేయాలి. లేకపోతే.. మరింత నష్టపోతారు`` అంటూ.. తన ఎగ్జిక్యూటివ్ అధికారాల అంశాన్ని ట్రంప్ పరోక్షంగా లేవనెత్తారు. ఈ పరిణామాలపై అమెరికా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండేళ్లు భరించాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
