Begin typing your search above and press return to search.

మినియేచర్స్ ను రాజమౌళి వాడినట్టుగా ఇంకెవరు వాడటం లేదా?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొచ్చిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి... ఆయన చేసిన సినిమాలన్ని ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి.

By:  Gopi Velupala   |   26 Sept 2026 5:00 AM IST
మినియేచర్స్ ను రాజమౌళి వాడినట్టుగా ఇంకెవరు వాడటం లేదా?
X

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొచ్చిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి... ఆయన చేసిన సినిమాలన్ని ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఆయన ఇప్పటివరకు 12 సినిమాలు చేయగా అవన్నీ సూపర్ సక్సెస్ లను సాధించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. రాజమౌళి లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో మరొకరు లేరనేది వాస్తవం...ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. 'త్రిబుల్ ఆర్' సినిమాతో సక్సెస్ ని సాధించిన ఆయన ఎలాగైనా సరే ఇప్పుడు హాలీవుడ్ దర్శకులకు తను పోటీగా మహేష్ బాబు తో వారణాసి అనే సినిమాని తెరకెక్కిస్తుండడం విశేషం... ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్రపంచస్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఇలాంటి భారీ సెటప్ తో ఉన్న సినిమాలను చేసేటప్పుడు దర్శకుల ఇమేజినేషన్ కి ఎక్కడ తగ్గకుండా ఉండాలంటే ప్రతి సన్నివేశాన్ని భారీ లెవెల్లోనే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అనుకున్న విజువల్స్ ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయడానికి కొన్ని సందర్భాల్లో లైవ్ లోకేషన్స్ లో షూట్ చేయడం కష్టమవుతుంది. దాంతో మినియేచర్స్ సహాయంతో ఆ పెద్ద పెద్ద సెట్స్ ను చిన్నగా సెట్ చేసి షూట్ చేస్తుంటారు. హాలీవుడ్ మేకర్స్ ఎక్కువగా మినియేచర్స్ తోనే సినిమాలు చేస్తుంటారు. ఇక రాజమౌళి సైతం త్రిబుల్ ఆర్ సినిమా ట్రైన్ ఎపిసోడ్ కోసం మినియేచర్ ను వాడాడు.

ఇప్పుడు వారణాసి సినిమాకి సైతం చాలా ఎక్కువ సందర్భాల్లో మినియేచర్స్ ను వాడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు రావాలన్నా కూడా అది రాజమౌళితోనే సాధ్యం అనేంతల గుర్తింపును సంపాదించుకున్నాడు. వారణాసి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేస్తే మాత్రం రాజమౌళిని మించిన తెలుగు దర్శకుడు మరొకరు లేరనెంతల పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటాడు..ఏది ఏమైనా కూడా రాజమౌళి తెలుగు సినిమా దర్శకుడు అవ్వడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి... ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇప్పటికే వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్ కథని కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు డిఫరెంట్ సబ్జెక్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి రాబోయే మరిన్ని సినిమాలు అతన్ని టాప్ పొజిషన్ కి తీసుకెళ్లాలని తద్వారా ఇండస్ట్రీని సైతం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుకుందాం...