ప్యారడైజ్.. నాని మీద భారీ బెట్..?
న్యాచురల్ స్టార్ నాని ఈమధ్య కెరీర్ లో చాలా రిస్కీ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. వరుస సక్సెస్ లు ఒక పక్క జోష్ ఇస్తుంటే నెక్స్ట్ దాన్ని మించి అనిపించేయాలని ఒక దానికి మించి మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు నాని.
By: Ramesh Boddu | 21 Aug 2025 11:16 AM ISTన్యాచురల్ స్టార్ నాని ఈమధ్య కెరీర్ లో చాలా రిస్కీ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. వరుస సక్సెస్ లు ఒక పక్క జోష్ ఇస్తుంటే నెక్స్ట్ దాన్ని మించి అనిపించేయాలని ఒక దానికి మించి మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు నాని. దసరాతో నానిలోని మాస్ ని చూపించిన శ్రీకాంత్ ఓదెల ఈసారి ది ప్యారడైజ్ అంటూ మరో కొత్త మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని పాత్రలో వేరియేషన్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయని టాక్.
బడ్జెట్ 150 కోట్లు..
ఈ సినిమాలో నాని జడల్ అనే డిఫరెంట్ రోల్ లో ఆడియన్స్ కి షాక్ ఇస్తారట. నాని జడలతో కనిపించడం కూడా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయబోతుంది. ఐతే నాని ప్యారడైజ్ సినిమాతో కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తున్నాడని తెలుస్తుంది. నాని ప్యారడైజ్ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఇప్పటివరకు నాని సినిమా హయ్యెస్ట్ అంటే అది 70 కోట్లు మాత్రమే. అంటే ది ప్యారడైజ్ కి డబుల్ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా మీద నానికి ఉన్న నమ్మకం.. నిర్మాతలను అంత బడ్జెట్ పెట్టేలా చేస్తుందని అంటున్నారు. అంతేకాదు నాని ఈ సినిమాతో మరోసారి తన వర్సటాలిటీ చూపిస్తాడని తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మరోసారి నాని మాస్ స్టామినా ఏంటో చూపించేలా చేస్తున్నాడట. తప్పకుండా నాని అండ్ టీం ది ప్యారడైజ్ కోసం భారీ రేంజ్ లో కష్టపడుతున్నారని తెలుస్తుంది.
ప్యారడైజ్ మాస్ డోస్..
నాని కూడా కెరీర్ లో ప్రతి సినిమాను మొదటి సినిమాలానే కష్టపడుతున్నాడు. ఈరోజు నీకొచ్చిన ఈ ఛాన్స్ తోనే నువ్వు ప్రూవ్ చేసుకోవాలని తను ప్రతి సినిమాకు పనిచేస్తానని అంతకుముందు నాని చెప్పాడు.
ఐతే ది ప్యారడైజ్ విషయంలో మాస్ డోస్ మరింత పెంచి ఒక రేంజ్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా ది ప్యారడైజ్ సంథింగ్ స్పెషల్ మూవీగా ఉండబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీకాంత్ కూడా దసరాతో ఇచ్చిన డోస్ కన్నా డబుల్ ఇంపాక్ట్ తో ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. నాని ఈ రేంజ్ లో కష్టపడుతున్నాడు అంటే సినిమా తప్పకుండా నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. నాని ప్యారడైజ్ కమర్షియల్ హిట్ మాత్రమే కాదు అవార్డుల గురి కూడా పెట్టారని తెలుస్తుంది.
