జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ కుటుంబ సభ్యులతో కలిసి జపాన్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. జపాన్ మత గురువుల మధ్య హోమం నిర్వహించి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలను విజయ్ సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
By: Madhu Reddy | 9 Nov 2026 10:56 AM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తో కలిసి రాహుల్ సాంకృత్యాన్ నటించిన చిత్రం రణబాలి. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కూడా ఇదే కావడం గమనార్హం . రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరొకవైపు ఇటు విజయ్ దేవరకొండ అటు రష్మిక మందన్న ఇద్దరు తమ సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ.. కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో గడుపుతూ అభిమానులతో ఆ ఫోటోలను పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా దీపావళి సందర్భంగా వెకేషన్ కి వెళ్ళిన వీరు ఏకంగా జపనీయుల మధ్య దీపావళి వేడుకలను జరుపుకున్నారు. తన భార్య రష్మిక మందన్న, తమ్ముడు, ప్రముఖ హీరో ఆనంద్ దేవరకొండ తో పాటు తమ తల్లిదండ్రులతో కలిసి జపాన్ వెళ్లిన వీరు.. అక్కడ జపాన్ మత గురువుల మధ్య హోమం జరిపించి, దీపావళి పండుగను వారి మధ్య జరుపుకున్నారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
జపాన్ లో దీపావళి సందర్భంగా అక్కడ హోమం చేయడానికి మాకు ఒక మార్గం దొరికింది. చాలా సంతోషంగా అనిపిస్తోంది. మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దేవరకొండ కుటుంబం తరఫున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు అంటూ విజయ్ దేవరకొండ రాసుకొచ్చారు. మొత్తానికైతే దీపావళి సందర్భంగా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అటు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న క్యూట్ పిక్స్ కూడా షేర్ చేయగా వీటిని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. రణబాలితో మంచి విజయం అందుకున్న ఈయన ప్రస్తుతం రౌడీ జనార్ధన్ అనే మరో యాక్షన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. రవి కిరణ్ కోలా రచన ,దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రాజెక్టును శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో రాజశేఖర్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తుండగా క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నారు.
రష్మిక మందన్న ప్రస్తుతం యాక్షన్ డ్రామా మైసా మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. నవంబర్ 27వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో కూడా ఈమె నటిస్తోంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పుష్ప 3 : ది రాంపేజ్ లో కూడా ఈమె నటించబోతున్న విషయం తెలిసిందే.
