కొత్త ట్రెండ్: హనీమూన్ ముందు మినీమూన్
రెండు మూడు వారాల సుదీర్ఘ కాలం హనీమూన్ కోసం వెళ్లడం జంటలకు అలవాటు.
By: Sivaji Kontham | 24 Nov 2025 6:00 AM ISTరెండు మూడు వారాల సుదీర్ఘ కాలం హనీమూన్ కోసం వెళ్లడం జంటలకు అలవాటు. కానీ ఇటీవలి కాలంలో హనీమూన్ కంటే ముందు మినీమూన్ కి వెళ్లేందుకు జంటలు అధికంగా ఇష్టపడుతున్నారని థ్రిల్లోఫిలియా ప్రకటించింది. కొత్త జంటల మూడ్స్ ప్రకారం ఈ సంస్థ కొత్తగా విడుదల చేసిన హనీమూన్ ట్రావెల్ రిపోర్ట్ 2025-26 లో ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి. ఇటీవల భారతీయ జంటలు కొత్త ట్రెండ్‌ను స్వీకరిస్తున్నారు! పెళ్లి తర్వాత వెంటనే `మినీమూన్` ప్లాన్ చేస్తున్నారు. ఇది రెండు మూడు రోజులలో ముగిసే ట్రిప్. కొన్ని నెలల తర్వాత సుదీర్ఘమైన `బిగ్-మూన్`ని ప్లాన్ చేస్తున్నారు.
ఈ తరహా చిన్న ట్రిప్‌లు సంవత్సరానికి 18 శాతానికి పెరుగుతున్నాయని, ఇది జంటలు తమ ప్రయాణం ఎలా సాగాలి? విశ్రాంతి కోసం ఎంచుకునే ఎంజాయ్‌మెంట్ రేంజు ఎలా? అనే విషయాలు జనరేషన్ వైజ్ మారుతున్నాయి. మినీ మూన్ లు నేటి తరం ట్రెండ్. నూతన వధూవరులకు ఇచ్చే సెలవుల ఆధారంగా, వీసాలతో పని లేని విధంగా 3-5 రాత్రుల ఎస్కేప్ ప్లాన్‌ను ఎంచుకుంటున్నారు.
దీనికి భిన్నంగా బిగ్-మూన్ అనేది ప్రధానమైన హనీమూన్. ప్రైవేట్ పూల్స్, బీచ్‌లు లేదా పర్వతాలు ఉన్న ప్రదేశాలకు వెళ్లి ఈ ప్రపంచానికి దూరంగా ఉండటానికి సహకరించే స్థలాలుగా వీటిని చూడాలి. థ్రిల్లోఫిలియా ప్రకారం...జంటలు విశ్రాంతి, సాహసం రెండింటినీ కోరుకుంటున్నాయి. కానీ ఒకేసారి కాదు. స్థానికంగా అందుబాటులో ఉండే లొకేషన్లను ఇవి ఎంచుకుంటున్నాయి.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హనీమూన్ డెస్టినేషన్స్ గా కేరళ - 17 శాతం, అండమాన్ - 14 శాతం, గోవా - 13 శాతం, రాజస్థాన్ - 12 శాతం, మేఘాలయ, కూర్గ్, హిమాచల్ ప్రదేశ్ లను జంటలు ఇష్టమైన ప్రదేశాలుగా భావిస్తున్నాయి. అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన హనీమూన్ గమ్యస్థానాలను పరిశీలిస్తే, బాలి - 21 శాతం, మాల్దీవులు - 18 శాతం, థాయిలాండ్ - 16 శాతం, వియత్నాం - 14 శాతం మంది వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారు.
మేఘాలయ, అండమాన్ వంటి ఎగ్జోటిక్ లొకేషన్లకు దేశీయ బుకింగ్‌లు 40 శాతం పైగా పెరిగాయి. వియత్నాం, జార్జియా, శ్రీలంక అంతర్జాతీయ విష్ లిస్ట్‌లో ముందున్నాయి. వీసా సౌలభ్యం, వేగంగా ప్రయాణాలకు అవసరమయ్యే విమానాల సదుపాయం, గోప్యత వంటివి అంతర్జాతీయ హనీమూన్‌లలో 41 శాతం పెరుగుదలకు దారితీశాయి. భారతీయ జంటలు ఎక్కువగా ప్రయాణించడమే కాదు తెలివిగా ప్రయాణిస్తున్నారని కూడా సర్వే తేల్చింది.
థ్రిల్లోఫిలియా రిపోర్ట్ ప్రకారం... బీచ్ డిన్నర్లు, సూర్యాస్తమయ క్రూయిజ్‌లు, విల్లా బసలు, ప్రైవేట్ పడవలు వంటి ప్రైవేట్ లేదా రొమాంటిక్ యాడ్-ఆన్‌లకు 64 శాతం అప్‌గ్రేడ్ అయ్యాయి. 42 శాతం స్నార్కెలింగ్, జిప్‌లైనింగ్, మంచు కార్యకలాపాలు వంటి తేలికపాటి సాహసాలు ఉన్నాయి. ఆయుర్వేద బసలు, ఎడారి నక్షత్రాల వీక్షణ వంటి ప్రకృతి మరియు వెల్‌నెస్ రిట్రీట్‌లు వేగంగా పెరుగుతున్నాయి.
జంటలు ఎలా ఖర్చు చేస్తున్నారు? అంటే.. దేశీయ హనీమూన్‌ల కోసం జంటకు రూ1.05 లక్షలు, అంతర్జాతీయ హనీమూన్ కోసం రూ.2.45 లక్షలు ఖర్చవుతున్నాయి. మాల్దీవులు: 2.8 లక్షలు ఖర్చవుతోంది.
టైర్-2 , టైర్-3 నగరాలు ఇప్పుడు హనీమూన్ బుకింగ్‌లలో 46 శాతం వాటాను అందించడం ఆశ్చర్యకరం. జైపూర్, ఇండోర్, లక్నో, సూరత్, కొచ్చి కొత్త జంటలను ప్రపంచ దేశాలకు పంపే నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.
