Begin typing your search above and press return to search.

ఇండిగో ఫ్లైట్స్ రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ!

ఇండిగో విమానాల రద్దు కారణంగా చాలామంది ప్రయాణించడానికి ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు.ఈ క్రమంలోనే ఎక్కువ శాతం మంది రైల్వే మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రయాణికుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న రైల్వేశాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Madhu Reddy   |   6 Dec 2025 1:16 PM IST
ఇండిగో ఫ్లైట్స్ రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ!
X

ఇండిగో విమాన సంస్థలో ఏర్పడిన నిర్వహణ లోపం కారణంగా ఎన్నో విమానాలు రద్దయ్యి వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణికులతో ప్రతి చోట గందరగోళం సృష్టించబడుతోంది. అయితే విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడడంతో రైల్వే శాఖ మద్దతు తెలపడానికి ముందుకు వచ్చింది. ఇండిగో విమానాల రద్దు కారణంగా చాలామంది ప్రయాణించడానికి ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు.ఈ క్రమంలోనే ఎక్కువ శాతం మంది రైల్వే మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రయాణికుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న రైల్వేశాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

అందులో భాగంగానే భారతీయ రైల్వే వ్యవస్థ అనేక ముఖ్యమైన మార్గాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి వెంటనే నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లకు 116 అదనపు కోచ్ లను జోడించింది. దక్షిణ రైల్వే 18 ప్రధాన రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచింది. లాంగ్ రూట్ ప్రయాణికులకు సహాయం చేయడానికి తూర్పు రైల్వే 3 కీలక రైళ్లలో అదనపు స్లీపర్ క్లాస్ లను జోడించింది. అలాగే ఉత్తర రైల్వే.. 8 రైళ్లలో థర్డ్ ఏసి కోచ్ లను అదనంగా జోడించింది. పశ్చిమ రైల్వే రద్దీ మార్గాల్లో థర్డ్ ఏసి,సెకండ్ ఏసి కోచ్ లను పెంచింది. తూర్పు మధ్య రైల్వే లో అనేక రైళ్లలో అదనపు సెకండ్ ఏసీ కోచ్ లను కూడా జోడించింది. అయితే విమానాల రద్దు కారణంగా రైల్వే సంస్థ ముందుకు రావడంతో.. రైళ్లలో ఈ మార్పులను చేయాలని.. ఈనెల పదవ తేదీ వరకు 10 రద్దీ మార్గాల్లో అదనపు కోచ్ లను పెంచాలని నిర్ణయించుకున్నారు.

ఆకస్మిక విమానాల రద్దు కారణంగా చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులకు ఈ అదనపు కోచ్ లు గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సహాయపడతాయని భావిస్తున్నారు.సరైన నోటీస్ ఇవ్వకుండా విమానాలను రద్దు చేసినందుకు అనేక విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇండిగో సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. రైల్వే శాఖ సుదూర ప్రయాణాలకు వెళ్లే ప్రయాణికులను తీసుకు వెళ్లడానికి నిర్ణయించుకోవడంతో ప్రయాణికులకు కాస్త ఉపశమనం లభించింది. ఇక ఈ విమాన సంక్షోభం పరిష్కారం కావడానికి మరి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మంది ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి రైల్వే రంగం సిద్ధమవుతుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడం మా ముందున్న కర్తవ్యం అంటూ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి విచారణ కమిటీ వేస్తామని కూడా చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయం పక్కన పెడితే తాజాగా విమానాల రద్దు సంక్షోభం ఏకంగా సుప్రీంకోర్టును తాకింది. విమాన సర్వీస్ ల రద్దు పై దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఈ పిటిషన్ పై తక్షణమే విచారణ చేయాలని పిటిషనర్ కోరారు. అలాగే స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ,డిజిసిఏ ను కూడా ఆదేశించాలని అభ్యర్థించారు. విమానాల రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. మరి విమానాల రద్దు పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.