విదేశీయులు మెచ్చిన నగరం.. అభివృద్ధిలో వేగవంతం!
కేరళ రాష్ట్ర రాజధానిగా కేరళ రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా పేరు దక్కించుకుంది తిరువనంతపురం. గతంలో త్రివేండ్రం అని పిలవబడే ఈ ప్రాంతం సంస్కృతి, చరిత్ర, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది.
By: Madhu Reddy | 8 Jan 2026 8:00 AM ISTఎన్నో సంస్కృతులు, సాంప్రదాయాలకు పెట్టింది పేరు భారతదేశం. అలాంటి మన భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు విదేశీయులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మన భారతదేశ మొత్తం ఎన్నో వింతైన ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తుండగా.. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలోని ఒక నగరం మాత్రం వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా.. విదేశీయులను మరింత వేగంగా ఆకర్షిస్తోంది. అలా విదేశీయులు మెచ్చిన నగరంగా.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణ భారతదేశంలోని కేరళ తిరువనంతపురం మొదటిస్థానంలో నిలిచింది. అలా అంతర్జాతీయ ప్రయాణికులు మెచ్చిన నగరంగా తిరువనంతపురం పేరు దక్కించుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
అలా పర్యాటక కేంద్రాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా పేరు దక్కించుకున్న తిరువనంతపురంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు ఏంటి? విదేశీయులను ఆకర్షిస్తున్న ఆ ప్రాంతాలు ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
కేరళ రాష్ట్ర రాజధానిగా కేరళ రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా పేరు దక్కించుకుంది తిరువనంతపురం. గతంలో త్రివేండ్రం అని పిలవబడే ఈ ప్రాంతం సంస్కృతి, చరిత్ర, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా శ్రీ పద్మనాభ స్వామి ఆలయం, కోవలం బీచ్, పొన్నుడి ఓవర్ వంటి ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఐటి కేంద్రం కూడా.. అపారమైన సంపదను కలిగి ఉన్న, అద్భుతమైన ద్రవిడ శైలిలో నిర్మించబడిన విష్ణు ఆలయం ఈ తిరువనంతపురంలోనే ఉంది. అలాగే సూర్య స్నానాలకు, విశ్రాంతికి అనువైన కోవలం బీచ్ కూడా ఇక్కడే ఉంది. అంతేకాదు హిల్ స్టేషన్ , పచ్చని కొండలతో కూడిన అందమైన ప్రదేశంగా, పర్యాటకులను ఆకర్షిస్తున్న పొన్ముడి కూడా ఇక్కడే ఉంది. అంతేకాదు మడ అడవులు, బ్యాక్ వాటర్స్ ఉన్న ప్రదేశం, బోట్ రైడ్లకు ప్రసిద్ధి చెందిన పోవర్ కూడా విదేశీయులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అలాగే వలస రాజ్యాల కాలంనాటి కళాఖండాలు, శిల్పకలను ప్రదర్శించే నెపియర్ మ్యూజియం కూడా ఇక్కడే ఉంది.
ఇకపోతే భారతదేశపు పచ్చటి నగరంగా మహాత్మాగాంధీ చేత పిలవబడిన ఈ నగరంలో ఆలయాలు, చర్చిలు, మసీదులతో సహా మతపరమైన వైవిధ్యానికి నిలయంగా మారింది.
ఇక భారతదేశంలోని మొదటి అలాగే అతిపెద్ద ఐటీ పార్క్ అయిన టెక్నో పార్క్ ఇక్కడే ఉంది. రాష్ట్ర సాఫ్ట్వేర్ ఎగుమతులలో ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తుంది. కేరళ రాజధానిగా ఆధునికత, సాంప్రదాయాల సమ్మేళనంతో ఒక విభిన్నమైన అనుభవాన్ని అందించే ఈ ప్రాంతానికి విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఉబర్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
వీటన్నిటి కారణంగానే అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న నగరంగా మారడమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఏకంగా 22వ స్థానానికి చేరుకుంది..
ఇకపోతే తిరువనంతపురము ప్రశాంతమైన బీచులు, ప్రాచీన దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలే కాకుండా ఆయుర్వేద చికిత్స కోసం కూడా విదేశీయులను ఆకర్షిస్తోంది. మొత్తానికైతే కేరళ తిరువనంతపురం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా రికార్డు సృష్టించింది.
