Begin typing your search above and press return to search.

ఆమెను త‌ట్టుకోలేమ‌బ్బా.. చెవిరెడ్డికి సుధ సంక‌టం.. !

చంద్రగిరిలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధా రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది. నాని రాజకీయ గ్రాఫ్‌లో మార్పు వస్తే సుధ పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

By:  Garuda Media   |   10 Nov 2026 12:43 AM IST
ఆమెను త‌ట్టుకోలేమ‌బ్బా.. చెవిరెడ్డికి సుధ సంక‌టం.. !
X

ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల వేళ‌.. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం మీడియా వార్త‌ల్లో హైలెట్ అయింది. చంద్ర‌గిరిలో బ‌లమైన నాయ‌కుడిగా పేరొందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని నిలువ‌రించ‌డం లో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నేత పులివ‌ర్తి నాని స‌తీమ‌ణి సుధారెడ్డి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆమె దూకుడు ముందు చెవిరెడ్డి చేతులు క‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. ఆయ‌న ఎటు అడుగు వేస్తే.. సుధ కూడా అటే వేశారు. అన్నా.. అన్నా.. అంటూనే ఆయ‌న‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫ‌లితంగా చెవిరెడ్డికి చేతులు క‌ట్టేసిన‌ట్టు అయింది.

ఇక‌, ఈ ప‌రిణామం.. ఇక్క‌డితో ఆగుతుందా? వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా కొన‌సాగుతుందా? అనేది చ‌ర్చ‌. అయితే.. టీడీపీ వ‌ర్గాల అంచ‌నా మేర‌కు.. పార్టీ ప‌రంగా ఏ చిన్న తేడా వ‌చ్చినా.. సుధ నేరుగా అసెంబ్లీ బ‌రిలోకి దిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. నిజానికి చంద్రగిరిలో కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే కాదు, ఆయన ఇద్దరు కుమారులు (మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి) కూడా రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మోహిత్ రెడ్డి పోటీ చేసి ప‌రాజ‌యం పాలైనా.. ఓటు బ్యాంకును కాపాడుకున్నారు.

ఇక‌, టీడీపీ త‌ర‌ఫున గెలిచిన నాని.. మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నా రు. ఈ క్ర‌మంలో పులివర్తి నాని తరఫున ఆయ‌న స‌తీమ‌ణి సుధా రెడ్డి ముందుండి నడిపిస్తున్నారు. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది రెండు కుటుంబాల మధ్య ప్రతిష్ఠాత్మక పోరాటంగా మారనుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలు, ఉద్రిక్తతలు చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి చంద్రగిరిలో రాజకీయ వేడి పెరిగే అవకాశం ఉందని స్థానిక నాయ‌కులు అంచ‌నా వేస్తున్న‌రు.

సుధా రెడ్డి రాజకీయ భవిష్యత్తు

పులివర్తి సుధా రెడ్డి చూపిస్తున్న దూకుడు, క్షేత్రస్థాయి పర్యటనలు, ఫైర్‌బ్రాండ్ నాయ‌కురాలిగా ఆమె చేస్తున్న కామెంట్లు.. వంటివి చూస్తుంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమె మరింత కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో తిరిగి పుంజుకోవాలంటే సుధా రెడ్డి వ్యూహాలను దాటుకుని వెళ్ళడం ఒక పెద్ద రాజకీయ అడ్డంకి కానుంది. ఇదిలావుంటే.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే నాని గ్రాఫ్ ఏమాత్రం త‌గ్గినా.. సుధ అరంగేట్రం చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.ఇదే జ‌రిగితే.. అటు మ‌హిళా సెంటిమెంటుతో పాటు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి రూపంలోనూ చెవిరెడ్డికి మ‌రింత సంక‌ట స్థితి ఎదురుకానుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.