అక్కడి నుంచే పోటీ.. ఆ నియోజకవర్గమే ఎందుకు? కవిత నిర్ణయం వెనుక అసలు కథేంటి?
నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత ఈసారి బోధన్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో బీజేపీ బలం, బీఆర్ఎస్ నేతలతో విభేదాల నేపథ్యంలో నియోజకవర్గం మార్చుకున్నట్లు సమాచారం. బోధన్‌లో బీఆర్ఎస్ బలంగా ఉన్నా, ప్రస్తుత ఎమ్మెల్యే షకీల్‌పై వ్యతిరేకత ఉండటంతో అక్కడ గెలుపుపై కవిత ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
By: A.N.Kumar | 25 Nov 2026 6:12 PM ISTకల్వకుంట్ల కవితకు నిజామాబాద్ తొలిసారి కలిసివచ్చింది..మలి సారి ఓడించేసింది. అక్కడ బీజేపీ నుంచి పోటీచేసిన ధర్మపురి అరవింద్ గెలిచి ఎంపీ అయిపోయాడు.ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కవిత పోటీచేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆమె బరిని మార్చుకుంది. ఎందుకు మార్చుకుంది? కొత్త నియోజకవర్గంగా ‘బోధన్’ ను ఎందుకు ఎంచుకుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కల్వకుంట్ల కవిత నియోజకవర్గ మార్పు వెనుక పెద్ద కథే ఉంది. బీఆర్ఎస్ నుంచి తొలిసారి ఈజీగా గెలిచిన కవితకు నాడు బీఆర్ఎస్ క్యాడర్ అండగా నిలిచింది. కానీ మలి సారి ఆమెకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారని..నిజామాబాద్, జగిత్యాల జిల్లాల బీఆర్ఎస్ నేతలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడేలా చేసి అక్కడ ధర్మపురి అరవింద్ ను గెలిపించేసి కవితను కావాలనే ఓడించారని కవితనే స్వయంగా ఆరోపించింది. అప్పటినుంచే నిజామాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కవిత సంచలన ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని అయితే దుమ్మెత్తిపోసింది.
అయితే నిజామాబాద్ లో బలమైన ధర్మపురి అరవింద్ ఉండడం..జగిత్యాల పరిధిలో బీఆర్ఎస్ ప్రాబల్యం అంతగా లేకపోవడం.. కవిత పరపతి పెద్దగా ప్రాభవం చూపేలా లేకపోవడంతో కవిత తన నియోజకవర్గాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. పైగా ఆమె ఎంచుకున్న నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా పరిధిలోనిదే.. కానీ అక్కడ ఎమ్మెల్యే షకీల్ పై తీవ్రమైన వ్యతిరేక ఉన్న నియోజకవర్గం. షకీల్ ను గెలిపిస్తే ఆయన అందుబాటులో ఉండక హైదరాబాద్ లో ఉండడం.. ఇప్పటికే రెండు సార్లు గెలవడం.. షకీల్ కుమారుడు ఓ యాక్సిడెంట్ లో ఇరుక్కొని కేసుల పాలవ్వడం.. షకీల్ పై కూడా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడం.. ముస్లిం ఓటు బ్యాంకు భారీగా ఉండడంతో కవిత ఈ ఈజీ నియోజకవర్గంలో పోటీచేసి గెలవచ్చని డిసైడ్ అయ్యి బోధన్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
బోధన్ లో బీఆర్ఎస్ బలంగా ఉన్నా ప్రస్తుత నేత షకీల్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ బలం అంతంతమాత్రమే.. అందుకే ఏరి కోరి ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. పొత్తులు లేకుండా ఒంటరిగాపోటీచేస్తానన్న కవిత ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నీ తెలుసుకొనే గెలిచే సీటును పికప్ చేసినట్టుగా అర్థమవుతోంది.
