వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వందల మంది!
వాట్సాప్ తన గ్రూప్ సభ్యుల పరిమితిని తాజాగా 1,500 మందికి పెంచింది. గతంలో 1,065 మందికి మాత్రమే అవకాశం ఉండగా, కొత్త ఫీచర్ గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. పెద్ద అపార్ట్‌మెంట్లు, సంస్థలు, కుటుంబాలు, స్నేహితుల గ్రూపులకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని వాట్సాప్ తెలిపింది.
By: Garuda Media | 19 Nov 2026 4:00 PM ISTగతంలో స్మార్ట్ ఫోన్ వినియోగం లేని రోజుల్లో షార్ట్ మెసేజ్‌లు పంపుకునే వారు. కానీ, స్మార్ట్ ఫోన్.. అందునా వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఒక్క సందేశాలేం మాట.. ఫొటోలు, ఆడియోలు, వీడియోలు ఇలా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్నింటినీ జనాలు వాడేస్తున్నారు. ఇప్పుడు సాధారణ ఫోన్ కంటే కూడా.. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్, ఫొటో, వీడియో షేరింగ్‌వంటివి దుమ్ముదులిపేస్తున్నాయి.
ఫోన్ వినియోగంలో వాట్సాప్‌దే ఇప్పుడు ప్రధాన భూమిక అని చెప్పాలి. తెల్లారి లేస్తే.. గుడ్ మార్నింగ్‌ల నుంచి గుడ్ నైట్ ల వరకు కూడా వాట్సాప్‌దే అగ్రస్థానం. దీనికి పోటీ పడలేక చాలా యాప్‌లు వెనక్కి కూడా వెళ్లిపోయాయి. ఇక, వాట్సాప్‌లో గ్రూప్‌డిస్కషన్లు, పోల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అలానే.. గ్రూపులను క్రియేట్ చేసి.. సమా చార మార్పిడి, చర్చలు, ఒక్కొక్కసారి మీటింగులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఆఫీసులు, విద్యాలయాలు.. ఇలా అనేక రూపాల్లో వాట్సాప్ వినియోగం పెరిగిపోయింది.
అయితే.. గ్రూప్‌లను ఏర్పాటు చేసే విషయంలో తొలి నాళ్లలో 100-150 మందికి అవకాశం కల్పించగా.. తర్వాత తర్వాత.. దీనిని 500 మంది వరకు పెంచారు. అంటే ఒకే గ్రూపులో 500 మంది సభ్యులను చేర్చుకునే అవకాశం.. ఎంత మందినైనా ఎడ్మిన్లను క్రియేట్ చేసుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత.. దీనిని 1000కి.. ఇటీవల 1065కి పెంచారు. ఉదాహరణకు ఒక కమ్యూనిటీ గ్రూప్ క్రియేట్ చేస్తే.. దానిలో 1065 మంది సభ్యులను చేర్చుకుని వారితో ఏకకాలంలో మాట్లాడే, సందేశాలు పంచుకునే సౌలభ్యం ఉంది.
కాగా.. తాజాగా ఈ పరిమితిని కూడా వాట్సాప్.. ఒకేసారి 1500లకు పెంచేసింది. అంటే.. ఒక గ్రూపుంలో 1500 మందిని చేర్చుకోవడంతోపాటు.. వారితో ముచ్చటించే, మీటింగులు పెట్టుకునే సౌలభ్యం కలగనుంది. ఈ ఫీచర్‌ను గురువా రం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా భారీ స్థాయి అపార్ట్‌మెంట్లు, పరిశ్రమల ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, లెక్కకు మిక్కిలిగా ఉన్న స్నేహితులకు ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుందని వాట్సాప్ పేర్కొంది.
