కాపీయింగ్‌కు చెక్ పెట్టాలంటే నిఘా ఒక్కటే మార్గమా? ఈ విధానం అన్ని చోట్ల సాధ్యమేనా?
పరీక్షల్లో కాపీయింగ్ అరికట్టేందుకు ఓ దేశంలో ఎత్తైన గాజు నడక మార్గాలు ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఖరీదైన నిర్మాణాలు, భద్రతా సమస్యల కంటే పరీక్షా విధానంలో మార్పులు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడం, వారి ప్రతిభను ప్రోత్సహించడమే శాశ్వత పరిష్కారమని విశ్లేషణ చెబుతోంది.
By: Madhu Reddy | 28 Nov 2026 3:32 PM ISTఓ దేశం లో పిల్లల పరీక్షల్లో కాపీయింగ్ ఆపడానికి ఎత్తులో గాజు నడక మార్గాలు నిర్మించి, పైనుంచి చూసే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. సీసీ కెమెరాలు, సిగ్నల్ బ్లాకర్లు చాలవన్నట్టు ఇప్పుడు ఇలాంటి కొత్త ప్రయోగాలు కనిపిస్తున్నాయి. కానీ నిఘా పెంచినంత మాత్రాన కాపీయింగ్ పూర్తిగా ఆగుతుందా? పైగా ఈ గాజు మార్గాలు అన్ని పరీక్షా కేంద్రాల్లో పెట్టడం ప్రాక్టికల్‌గా కుదిరే పనేనా? దీని వెనుక ఉన్న అసలు లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం..
గాజు మార్గాల ఖర్చు, సేఫ్టీ లెక్కేంటి?:
ఎత్తులో బలంగా ఉండే గాజు మార్గాలు కట్టడం అంటే మాటలు కాదు. దానికి భారీగా ఖర్చు అవుతుంది. ఒకటి రెండు పెద్ద సెంటర్లలో పెట్టినా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లు, కాలేజీల్లో ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇక దీనికి తోడు గాజు పలకల మెయింటెనెన్స్, భద్రతా ప్రమాదాలు లాంటి సమస్యలు కూడా ఉంటాయి. చిన్న పొరపాటు జరిగినా పెద్ద రిస్క్ అవుతుంది.
నిఘా కంటే సిస్టమ్ మారాలి కదా:
కాపీయింగ్ చేయాలనే ఆలోచన విద్యార్థులకు ఎందుకు వస్తోంది అనేది అసలు ప్రశ్న. కేవలం మార్కులు, ర్యాంకుల కోసం జరిగే విపరీతమైన పోటీ, బట్టీ పట్టే చదువులు దీనికి ప్రధాన కారణం. ఇక పిల్లల తలపై నుంచి నిఘా పెంచడం కంటే, పరీక్ష విధానంలోనే మార్పులు చేస్తే బెటర్. అర్థం చేసుకుని రాసేలా ప్రశ్నలు ఉంటే, కాపీ కొట్టాల్సిన అవసరమే రాదు.
ఒత్తిడి పెంచితే అసలు టాలెంట్ బయటకు వస్తుందా?:
పరీక్ష హాల్లోనే విద్యార్థులు చాలా టెన్షన్‌తో ఉంటారు. అలాంటిది పైనుంచి ఎవరో నిరంతరం చూస్తున్నారనే ఫీలింగ్ ఉంటే, ఆ ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. దానివల్ల చదివిన విషయాలు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. నిఘా అనేది ఒక హద్దు వరకు ఉండాలి కానీ, అది పిల్లలను భయపెట్టేలా ఉండకూడదు.
చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమే:
కొన్ని స్కూల్ లలో రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టిస్తుంటారు దీని వల్ల పిల్లలకు విసుగు వస్తుంది. ఆటలకు కూడా కొంత టైమ్ కేటాయిస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇక టీమ్ స్పిరిట్, ఓపిక లాంటివి ఆటల నుంచే వస్తాయి. అప్పుడు చదువు కూడా ఒక బరువులా కాకుండా సరదాగా అనిపిస్తుంది.
మార్కులు కాదు.. వాళ్లలోని ప్రతిభ చూడాలి:
స్కూళ్లలో ఓన్లీ మార్కులు, ర్యాంకులు చూడకుండా, పిల్లల్లో ఉన్న అసలు టాలెంట్ బయటకు తీయాలి. ఒక్కొక్కరికి ఒక్కో ఆసక్తి ఉంటుంది. ఇక దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఎవరికీ కాపీ కొట్టాల్సిన అవసరం ఉండదు.
కఠిన నిఘా కాదు.. మంచి మార్పు కావాలి:
కాపీయింగ్‌ను అరికట్టడానికి ఖరీదైన నిర్మాణాలు, కఠిన నిఘా కంటే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మార్పులే శాశ్వత పరిష్కారం. అన్ని చోట్ల సాధ్యం కాని పద్ధతుల కంటే, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచే విధానం వైపు అడుగులు వేయాలి..
