ఈ వారం సందడి చేయనున్న సినిమాలివే!
మరి ఈ వారం ఏ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి? ఏ కంటెంట్ ఓటీటీలో రిలీజ్ కానుందనేది చూద్దాం.
By: Sravani Lakshmi Srungarapu | 22 Sept 2025 12:28 PM ISTమరో వారం వచ్చేసింది. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా కొన్ని కొత్త సినిమాలు నేరుగా థియేటర్లలో రిలీజ్ కానుండగా మరి కొన్ని సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షో ల్లో ఓటీటీల్లో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం ఏ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి? ఏ కంటెంట్ ఓటీటీలో రిలీజ్ కానుందనేది చూద్దాం.
పవన్ కళ్యాణ్ ఓజి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ యంగ్ టాలెంట్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కగా, ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. గత కొన్ని సినిమాలుగా ఆకలి మీదున్న పవన్ ఫ్యాన్స్ కు ఓజి ఫుల్ మీల్స్ పెడుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాతో, అది కూడా ఓజి హైప్ ను తట్టుకోలేక తెలుగులో మరే చెప్పుకోదగ్గ సినిమా రిలీజ్ కావడం లేదు.
నీరజ్ గైవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ జరిగి అన్ని చోట్లా మంచి ప్రశంసలు అందుకుంది. రీసెంట్ గా ఆస్కార్ అవార్డులకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిందీ సినిమా. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా కీలక పాత్రల్లో నటించిన హోమ్ బౌండ్ సెప్టెంబర్ 26న రిలీజ్ కానుంది.
ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వాటిలో ముందుగా
నెట్‌ఫ్లిక్స్‌లో..
ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా అనే తెలుగు డబ్బింగ్ మూవీ
ది గెస్ట్ అనే హాలీవుడ్ సిరీస్
అలైస్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్
హౌస్ ఆఫ్ గిన్నీస్ అనే హాలీవుడ్ సిరీస్
మాంటిస్ అనే ఇంగ్లీష్ మూవీ
ప్రైమ్ వీడియోలో..
కొకైనా క్వార్టర్ బ్యాక్ అనే హాలీవుడ్ సిరీస్
హోటల్ కాస్టైరా అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
మాదేవా అనే కన్నడ సినిమా
టూ మచ్ విత్ కాజల్ అండ్ ట్వింకిల్ అనే బాలీవుడ్ టాక్ షో
జియో హాట్‌స్టార్‌లో..
సుందరకాండ అనే తెలుగు మూవీ
హృదయపూర్వం అనే తెలుగు డబ్బింగ్ మూవీ
ది డెవిల్ ఈజ్ బిజీ అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ
మార్వెల్ జాంబియాస్ అనే హాలీవుడ్ మూవీ
ది బల్లాడ్ ఆఫ్ వల్లిస్ ఐలాండ్ అనే హాలీవుడ్ ఫిల్మ్
ది ఫ్రెండ్ అనే హాలీవుడ్ మూవీ
ఉమన్ ఇన్ ది యార్డ్ అనే హాలీవుడ్ సినిమా
డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ అనే హాలీవుడ్ మూవీ
తల్సా కింగ్ అనే హిందీ మూవీ
ఆహాలో..
జూనియర్ అనే తెలుగు మూవీ
