ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. అది మాత్రం మిస్ అవ్వకండి!
కరోనా వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ప్రేక్షకులు థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలు చూడడానికి మక్కువ చూపుతున్నారు.
By: Madhu Reddy | 29 Aug 2025 3:11 PM ISTకరోనా వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ప్రేక్షకులు థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమాలు చూడడానికి మక్కువ చూపుతున్నారు. వీటికి తోడు సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తూ ఉండడంతో ఓటీటీలకు కూడా మంచి ఆదరణ పెరిగిపోయింది. ఇలా ప్రతివారం కూడా సరికొత్త సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి ఓటీటీ సంస్థలు. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం.
కింగ్డమ్:
విజయ్ దేవరకొండ హీరోగా.. డైరెక్టర్ గౌతం తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం కింగ్డమ్. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. కీలకమైన పాత్రలో సత్యదేవ్ కూడా నటించారు. ఈ సినిమా అన్నదమ్ముల మధ్య సాగే ఒక గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
The 100:
సీరియల్ నటుడు ఆర్కే సాగర్, నిషా నారంగ్ నటించిన చిత్రం ఇది. డైరెక్టర్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రం జూలైలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పోలీస్ డ్రామాగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మెట్రో ఇన్ డీనో:
ఆదిత్య కపూర్, సారా అలీఖాన్, నీనా గుప్తా తదితరులు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం మెట్రో ఇన్ డీనో. ఈ చిత్రాన్ని లవ్, రొమాన్స్ , రిలేషన్షిప్ నేపథ్యంలో తెరకెక్కించారు డైరెక్టర్ అనురాగ్ బసు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
భాగ్ సాలే:
సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహ హీరోగా నటించిన చిత్రం ఇది. సుమారుగా రెండేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రణీత్ బ్రాహ్మణపల్లి దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
లవ్ అన్ టాంగిల్డ్:
డైరెక్టర్ నామ్ కుంగ్ సన్ డైరెక్షన్లో వచ్చిన కొరియన్ డ్రామా సినిమా ఇది. ఈ సినిమా తమ మనసు ఇచ్చిన వారికి నచ్చే విధంగా ఉండాలనే.. అందమైన లవ్ స్టోరీగా తెరకెక్కించారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా ప్రేమికులు ఈ సినిమాని అసలు మిస్ అవ్వద్దు అని చూసినవారు కామెంట్లో చేస్తున్నారు.
ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
నెట్ ఫ్లిక్స్:
మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ (వెబ్ సిరీస్)
ది మదర్స్ డే మర్డర్ క్లబ్ ( మూవీ)
టూ గ్రేవ్స్ (స్పానిష్)
కరాటే కిడ్: లెజెండ్స్ -ఆగస్టు 30
అన్ నోన్ నెంబర్ (ఇంగ్లీష్ మూవీ)
అమెజాన్ ప్రైమ్:
అప్ లోడ్ 4(వెబ్ సిరీస్)
హాఫ్ సీఏ2 (హిందీ వెబ్ సిరీస్)
సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ)
Zee -5:
శోధ(కన్నడ వెబ్ సిరీస్)
ఈటీవీ విన్:
లెక్కల మాస్టర్ - ఆగస్టు 31
సోనీ లీవ్:
సంభవ వివరణమ్ నలర సంఘం (మలయాళ వెబ్ సిరీస్)
జియో హాట్ స్టార్:
హౌ ఔ లెఫ్ట్ ద ఓపన్ డే (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
రాంబో ఇన్ లవ్ (తెలుగు)
అటామిక్ - వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్ (హాలీవుడ్)
థండర్ బోల్డ్స్ (మూవీ)
