ఈ వీకెండ్స్ లో మస్తీ మజా.. ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాలు/ వెబ్ సిరీస్ లివే..
ఎప్పటిలాగే ఈవారం కూడా ప్రేక్షకులను అలరించడానికి కొన్ని మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేసాయి.
By: Madhu Reddy | 19 Dec 2025 12:06 PM ISTఎప్పటిలాగే ఈవారం కూడా ప్రేక్షకులను అలరించడానికి కొన్ని మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేసాయి. ముఖ్యంగా ఈ వీకెండ్స్ ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్న వారికి ఈ చిత్రాలు మంచి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాయని చెప్పవచ్చు. మరి ఈ వారంలో ఆడియన్స్ కు మజాను అందించబోతున్న ఆ చిత్రాలు, వెబ్ సిరీస్ లో ఏంటో ఒకసారి చూద్దాం..
జియో హాట్ స్టార్:
సంతాన ప్రాప్తిరస్తు:
శ్రీకాంత్ , చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా ఒకేసారి అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నవంబర్లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి దర్శకుడు సంజీవరెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో ఆమని, వెన్నెల కిషోర్ , తరుణ్ భాస్కర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అటు అమెజాన్ తో పాటు జియో హాట్ స్టార్ లో కూడా సందడి చేస్తోంది.
ఫార్మా (వెబ్ సిరీస్ - మలయాళం/ తెలుగు)
మిసెస్ దేశ్ పాండే (వెబ్ సిరీస్ - హిందీ/ తెలుగు)
అగ్లీ (వెబ్ సిరీస్) డిసెంబర్ 20
నెట్ ఫ్లిక్స్ :
ప్రేమంటే:
ప్రియదర్శి - ఆనంది కీలకపాత్రలో వచ్చిన తాజా చిత్రం ప్రేమంటే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో సుమాకనకాల, హైపర్ ఆది, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఎమిలీ ఇన్ పారిస్ 5 (వెబ్ సిరీస్ - ఇంగ్లీష్)
రాత్ అఖేలీ హై (వెబ్ సిరీస్ - హిందీ / తెలుగు)
బ్రేక్ డౌన్ : 1975 (డాక్యుమెంటరీ - ఇంగ్లీష్)
ది గ్రేట్ ఫ్లడ్ : (మూవీ - కొరియన్ /తెలుగు)
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (సెలబ్రిటీ టాక్ షో) డిసెంబర్ 20
అమెజాన్ ప్రైమ్ :
థామా (మూవీ - హిందీ)
ఏక్ దివానే కీ దివానీయత్ (మూవీ - హిందీ)
ఫాలౌట్ (వెబ్ సిరీస్ - ఇంగ్లీష్/ తెలుగు)
జీ 5:
నయనం (వెబ్ సిరీస్ - తెలుగు)
దివ్య దృష్టి (మూవీ - తెలుగు)
డొమినిక్ :
మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించిన ఈ డొమినిక్ చిత్రం కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కింది. ప్రస్తుతం జి 5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఈటీవీ విన్:
రాజు వెడ్స్ రాంబాయి:
అఖిల్, తేజస్వరాన్ జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఓటీటీ వేదికగా ఈటీవీలో ఎక్స్టెండెడ్ కట్ తో స్ట్రీమింగ్ అవుతోంది.
