Begin typing your search above and press return to search.

వీకెండ్ ప్లాన్ ఫిక్స్… ఈ వారం OTTలో రాబోయే హాట్ కంటెంట్!

కేవలం సినిమాలే కాదు, యూత్ మెచ్చే బోల్డ్ వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారం డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాయి.

By:  Madhu Reddy   |   8 Jun 2026 2:16 PM IST
వీకెండ్ ప్లాన్ ఫిక్స్… ఈ వారం OTTలో రాబోయే హాట్ కంటెంట్!
X

థియేటర్లలో 'పెద్ది' సందడి తర్వాత ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. అక్షయ్ కుమార్ హారర్ కామెడీ 'భూత్ బంగ్లా' నుండి, సూర్య నటించిన కోర్టు రూమ్ డ్రామా 'కరుప్పు' వరకు బోలెడు ఆప్షన్లు ఉన్నాయి. కేవలం సినిమాలే కాదు, యూత్ మెచ్చే బోల్డ్ వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారం డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నాయి. మీ వీకెండ్ వినోదం కోసం ఏయే ప్లాట్‌ఫామ్‌లో ఏయే సినిమాలు వస్తున్నాయో ఓసారి లుక్కేయండి.

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ మ్యాజిక్:

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, పరేష్ రావల్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ హారర్ కామెడీ 'భూత్ బంగ్లా'. ప్రియదర్శన్ మార్క్ కామెడీతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు జూన్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హారర్ ప్లస్ కామెడీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

సూర్య, త్రిషల కరుప్పు మూవీ :

కోలీవుడ్ స్టార్ సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కరుప్పు'. తెలుగులో దీనికి 'వీరభద్రుడు' అని పేరు పెట్టారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ జూన్ 12 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ దీన్ని చూడొచ్చు.

మలయాళ హిట్ థ్రిల్లర్ ‘దృఢం’:

మలయాళ సినిమాలు అంటేనే థ్రిల్లింగ్‌కు కేరాఫ్ అడ్రస్. షేన్ నిగమ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'దృఢం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మర్డర్ కేసును కేవలం వారం రోజుల్లో ఎలా ఛేదించాడు అనేదే ఈ సినిమా కథ. ఇది జూన్ 12 నుంచి 'జియో హాట్ స్టార్'లో తెలుగు, మలయాళం సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

యూత్ కోసం బోల్డ్ సిరీస్ ‘ష్:

ఓటీటీలో బోల్డ్ కంటెంట్‌కు ఉండే క్రేజే వేరు. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ అయిన 'ష్...' అంథాలజీ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో రాబోతోంది. ఇక మునుపటి కంటే మరింత రొమాంటిక్ అండ్ బోల్డ్ సీన్స్‌తో ఉన్న ఈ సిరీస్ 'ఆహా'లో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అలీ ఫజల్ ‘రాఖ్’ అండ్ అదర్స్:

'మీర్జాపూర్' ఫేమ్ అలీ ఫజల్, సోనాలి బింద్రే నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'రాఖ్' కూడా జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానుంది. ఇక అలాగే రొమాంటిక్ డ్రామా ఇష్టపడే వారి కోసం 'ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్' జూన్ 10 న, యానిమేషన్ ప్రియుల కోసం 'ఐయామ్ ఫ్రాంకెల్‌డా' జూన్ 16న లైన్‌లో ఉన్నాయి.

మొత్తానికి ఈ వీకెండ్ హారర్, క్రైమ్, రొమాన్స్ ఇలా అన్ని రకాల జోనర్లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కళకళలాడుతున్నాయి. థియేటర్లలో పెద్దగా సినిమాలు లేవు కాబట్టి, ఇంట్లోనే సెటిలైపోయి ఈ ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్‌లను ఎంజాయ్ చేయండి. హ్యాపీ వీకెండ్.