Begin typing your search above and press return to search.

వార్నర్ బ్రదర్స్ తో నెట్ ఫ్లిక్స్ భారీ డీల్.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ట్రంప్.. అసలేమైందంటే?

అయితే ఇలాంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఒప్పందం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

By:  Madhu Reddy   |   8 Dec 2025 12:22 PM IST
వార్నర్ బ్రదర్స్ తో నెట్ ఫ్లిక్స్ భారీ డీల్.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ట్రంప్.. అసలేమైందంటే?
X

ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఓ భారీ డీల్ కుదిరింది. అదేంటంటే వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కి చెందిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్ ని కొనుగోలు చేయడం కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ ముందుకు వచ్చింది. ప్రపంచంలో అతి పురాతనమైన స్టూడియోలను వార్నర్ బ్రదర్స్ కలిగి ఉన్నారు. ఆ స్టూడియో లను ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మూవీ స్టూడియో , HBO స్ట్రీమింగ్ నెట్వర్క్ లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ కొనుగోలు ఒప్పందం మరియు సంబంధిత అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఇలాంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఒప్పందం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాంతో దీనిపై నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అంటూ కొన్ని ఆందోళనలు బయటపెట్టారు. అయితే నెట్ ఫ్లిక్స్ ఈ ఒప్పందాన్ని $72 బిలియన్ వద్ద ముగించాలనే ఆలోచన చేస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్ కి మార్కెట్లో గణనీయమైన వాటా ఉంది. కానీ ట్రంప్ మాత్రం నెట్ఫ్లిక్స్ మరియు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మధ్య జరిగిన $72 బిలియన్ల విలీనం ఒక సమస్య కావచ్చని అన్నారు.

ఎందుకంటే ఫలితంగా వచ్చే కంపెనీకి మార్కెట్ వాటా ఎక్కువగా ఉంటుంది.అప్పులు లెక్కించినప్పుడు ఒప్పందం విలువ $82 బిలియన్లకు పైగా పెరుగుతుంది. నెక్ ఫ్లిక్స్ కి మార్కెట్లో చాలా పెద్ద వాటా ఉంది. నెట్ ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ స్టూడియోలను కొనుగోలు చేస్తే ఆ వాటా ఇంకా పెరుగుతుంది. 300 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న నెట్ ఫ్లిక్స్ నెంబర్ 1 స్ట్రీమింగ్ సర్వీస్. వార్నర్ యొక్క HBO మ్యాక్స్ కొంచెం తక్కువ స్థానంలో ఉంది.

ఈ ఒప్పందం ఆమోద ముద్ర వేయడానికి ముందు కొంతమంది ఆర్థికవేత్తలను సంప్రదిస్తానని ట్రంప్ తెలిపారు. అలాగే నేను కూడా ఈ చర్చల్లో స్వయంగా పాల్గొంటానని తెలిపారు.నెట్ ఫ్లిక్స్ సహ-CEO టెడ్ సరండోస్ ను తాను కలిశానని ట్రంప్ వెల్లడించారు. ఆయన సినిమా చరిత్రలో ఒక గొప్ప పని చేశారని ట్రంప్ తెలిపారు. అయితే చారిత్రాత్మకంగా కంపెనీలు విలీనం కావాలని కోరినప్పుడు అధ్యక్షులు తరచుగా యాంటీ ట్రస్టు ఆమోదాలలో పాల్గొనలేదు. అయితే నెట్ ఫ్లిక్స్ లేదా వార్నర్ బ్రదర్స్ ఏ ప్రసారం స్టేషన్లను కలిగి లేరు కాబట్టి ఈ ఒప్పందానికి ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఆమోదం అవసరం లేదు. అయితే దీనికి న్యాయశాఖ యొక్క యాంటీట్రస్ట్ విభాగం ఆమోదం అవసరం కావచ్చు.

అలాగే నెట్ ఫ్లిక్స్ మార్కెట్లో పెద్ద దిగ్గజంగా తనను తాను నిలబెట్టుకోవాలని కోరుకుంటుంది. తద్వారా రాబోయే దశాబ్దాలలో విజయం సాధించాలని కోరుకుంటుంది. అయితే నెట్ఫ్లిక్స్ తన లక్ష్యాన్ని పెద్దగా పెట్టుకోవడం వల్ల వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ట్రంప్ జోక్యం చేసుకోవడంతో ఈ విషయం ప్రపంచ దేశాలలో మరింత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. మరి చర్చల్లో పాల్గొనబోయే ట్రంప్ తన అభిప్రాయాలను ఏ విధంగా వ్యక్తం చేస్తారో చూడాలి.