Begin typing your search above and press return to search.

ఓటీటీలో సందడి చేస్తున్న ఫ్రైడే స్పెషల్ మూవీస్!

ఎండలు మండిపోతున్నా, వినోద ప్రియులకు మాత్రం ఓటీటీ చల్లని కబురు తెస్తుంది. థియేటర్లలో రచ్చ చేసిన బ్లాక్‌బస్టర్ల దగ్గర నుండి, ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ల వరకు ఈ వారం వినోదాల విందు సిద్ధమైంది.

By:  Madhu Reddy   |   8 May 2026 3:54 PM IST
ఓటీటీలో సందడి చేస్తున్న ఫ్రైడే స్పెషల్ మూవీస్!
X

ఎండలు మండిపోతున్నా, వినోద ప్రియులకు మాత్రం ఓటీటీ చల్లని కబురు తెస్తుంది. థియేటర్లలో రచ్చ చేసిన బ్లాక్‌బస్టర్ల దగ్గర నుండి, ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ల వరకు ఈ వారం వినోదాల విందు సిద్ధమైంది. అడివి శేష్ యాక్షన్, ప్రదీప్ రంగనాథన్ కామెడీ, ప్రియాంకా చోప్రా సాహసాలు.. ఇలా ఒకటా రెండా? పదికి పైగా సినిమాలు మీ ఇంట్లోనే సందడి చేయబోతున్నాయి. ఈ వీకెండ్‌ని కలర్‌ఫుల్‌గా మార్చేసే ఆ లిస్ట్ ఏంటో చూసేయండి..

యంగ్ ఎనర్జీతో 'LIK' వచ్చేసింది:

కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ 'ఎల్‌ఐకే - లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ'. ఏప్రిల్ లో థియేటర్లలో రిలీజ్ అయి యూత్‌ను భలే ఆకట్టుకుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ కాగా, ఎస్. జె. సూర్య తన నటనతో అదరగొట్టారు. మే 6 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

యాక్షన్ కింగ్ 'డెకాయిట్' సందడి:

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. విజువల్ వండర్‌గా సాగే ఈ యాక్షన్ లవ్ స్టోరీ మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు మిగిలిన సౌత్ భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన శేష్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండగే.

గ్లోబల్ స్పై 'సిటాడెల్' సీజన్ 2:

ప్రియాంకా చోప్రా ఇంటర్నేషనల్ క్రేజ్‌ను మరో మెట్టు ఎక్కించిన సిరీస్ 'సిటాడెల్'. ఇప్పుడు సీజన్ 2 భారీ అంచనాలతో మే 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. ఇక మొత్తం ఏడు ఎపిసోడ్లు ఒకేసారి రిలీజ్ అవ్వడంతో వీకెండ్ అంతా ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌తో బింజ్ వాచ్ చేసేయొచ్చు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సీజన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

థియేటర్లలో కొత్త హడావుడి:

ఓటీటీతో పాటు థియేటర్లలో కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి, రవిబాబు డైరెక్షన్‌లో వస్తున్న రేజర్ సినిమాలపై తెలుగు ఆడియన్స్‌లో మంచి హైప్ ఉంది. ఇక వీటితో పాటు రిషభ్ శెట్టి డబ్బింగ్ మూవీ ఏ ఫిల్మ్ బై గిరి, గోదారి గట్టుపైన వంటి చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

మొత్తానికి ఈ వారం సినిమాల జాతర ఓ రేంజ్‌లో ఉంది. ఒకవైపు అడివి శేష్ యాక్షన్, మరోవైపు ప్రదీప్ రంగనాథన్ నవ్వులు.. ఇలా ప్రతి జోనర్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎండలో బయటకు వెళ్లడం ఎందుకని అనుకునే వారు, హాయిగా ఇంట్లోనే కూర్చుని ఈ వీకెండ్‌ను వినోదాత్మకంగా గడిపేయొచ్చు.