Begin typing your search above and press return to search.

ఈ వారం కొత్త రిలీజులివే!

ఈ వారం ఇంకొన్ని సినిమాలు ఆడియ‌న్స్ ముందు రావ‌డానికి రెడీ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.

By:  Sravani Lakshmi Srungarapu   |   15 Sept 2025 11:32 AM IST
ఈ వారం కొత్త రిలీజులివే!
X

ప్ర‌తీ వారం కొత్త కంటెంట్ వ‌చ్చిన‌ట్టే ఈ వారం కూడా కొత్త సినిమాలు కొన్ని థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతుంటే మ‌రికొన్ని ఓటీటీలోకి రానున్నాయి. గ‌త వారం మిరాయ్, కిష్కింధ‌పురి సినిమాలు రిలీజై ఆడియ‌న్స్ కు మంచి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తే, ఈ వారం ఇంకొన్ని సినిమాలు ఆడియ‌న్స్ ముందు రావ‌డానికి రెడీ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.

ద‌క్ష‌

మంచు ల‌క్ష్మి త‌న తండ్రి మోహ‌న్ బాబుతో క‌లిసి న‌టిస్తూ ఈ సినిమాను నిర్మించారు. వంశీ కృష్ణ మ‌ల్లా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ లో ల‌క్ష్మి పోలీసాఫీస‌ర్ గా క‌నిపించ‌నుండ‌గా సెప్టెంబ‌ర్ 19న ఈ మూవీ రిలీజ్ కానుంది.

బ్యూటీ

య‌దార్థ సంఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిన ప్రేమ క‌థా చిత్రంగా రానున్న బ్యూటీ సెప్టెంబ‌ర్ 19న రిలీజ్ కానుండ‌గా అంకిత్ కొయ్య‌, నీల‌ఖి జంట‌గా న‌టించారు. సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ మూవీకి క‌థ అందించ‌గా శివ సాయి వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అందెల ర‌వమిది

ఇంద్రాణి దావ‌లూరి న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా అందెల ర‌వమిది. ఈ సినిమాను స్వ‌ర్ణ‌క‌మ‌లం స్పూర్తితో తీసిన‌ట్టు కూడా ఇంద్రాణి చెప్పారు. మ్యూజిక్, డ్యాన్స్ నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 19న రిలీజ్ కానుంది.

భ‌ద్ర‌కాళి

బిచ్చ‌గాడు మూవీతో తెలుగు ఆడియ‌న్స్ కు ద‌గ్గ‌రైన విజ‌య్ ఆంటోనీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన పొలిటిక‌ల్ మూవీ భ‌ద్ర‌కాళి. అరుణ్ ప్ర‌భు తెర‌కెక్కించిన ఈ సినిమాలో తృప్తి ర‌వీంద్ర హీరోయిన్ గా న‌టించగా భ‌ద్ర‌కాళి విజ‌య్ కెరీర్లో 25వ సినిమాగా వ‌స్తోంది.

వీర చంద్ర‌హాస

కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌వి బస్రూర్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన మొద‌టి సినిమా వీర చంద్ర‌హాస‌. ఆల్రెడీ క‌న్న‌డ‌లో రిలీజైన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 19న తెలుగులో రిలీజ్ కానుంది. ఈ మూవీలో క‌న్న‌డ ప్ర‌ముఖ న‌టుడు శివ రాజ్‌కుమార్ గెస్ట్ రోల్ లో క‌నిపించ‌నున్నారు.

జాలీ ఎల్ఎల్‌బీ 3

బాలీవుడ్ ఫ్రాంచైజ్ సినిమాల్లో ఆడియ‌న్స్ ను బాగా అల‌రించిన వాటిలో జాలీ ఎల్ఎల్‌బీ. ఆ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు మూడో భాగం ఈ శుక్ర‌వారం రిలీజ్ కానుంది. బ్లాక్ కామెడీ లీగ‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీకి సుభాష్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, అక్ష‌య్ కుమార్, అర్ష‌ద్ వార్షి లీడ్ రోల్స్ లో న‌టించారు.

ఇవి కాకుండా ఓటీటీలో కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కూడా రిలీజ్ కానున్నాయి. అవేంటంటే..

నెట్‌ఫ్లిక్స్‌లో..

ది బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్‌సిరీస్‌

ప్లాటోనిక్ అనే వెబ్‌సిరీస్

బిలీయ‌నీర్స్ బంక‌ర్ అనే వెబ్‌సిరీస్

హాంటెడ్ హాస్ట‌ల్ అనే వెబ్‌సిరీస్

28 ఇయ‌ర్స్ లేట‌ర్ అనే వెబ్‌సిరీస్

జియో హాట్‌స్టార్‌లో..

పోలీస్ పోలీస్ అనే వెబ్‌సిరీస్

ది ట్ర‌య‌ల్2 అనే వెబ్‌సిరీస్

జీ5లో..

హౌస్‌మేట్స్ అనే టెలివిజ‌న్ సిరీస్