Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ కాదు ఓటీటీ డీల్స్ తోనే స‌త్తా!

బాక్సాఫీస్ లెక్క పాత ఓటీటీ లెక్క కొత్త అన్న‌ట్లు స‌న్నివేశం త‌యారైంది. ఒక‌ప్పుడు ఏ స్టార్ హీరో బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత కలెక్ట్ చేసాడు? అన్న‌ది ట్రెండింగ్ లో ఉండేది.

By:  Srikanth Kontham   |   12 Sept 2025 3:00 PM IST
బాక్సాఫీస్  కాదు ఓటీటీ డీల్స్ తోనే స‌త్తా!
X

బాక్సాఫీస్ లెక్క పాత ఓటీటీ లెక్క కొత్త అన్న‌ట్లు స‌న్నివేశం త‌యారైంది. ఒక‌ప్పుడు ఏ స్టార్ హీరో బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత కలెక్ట్ చేసాడు? అన్న‌ది ట్రెండింగ్ లో ఉండేది. ఓపెనింగ్స్ ఎలా వ‌చ్చాయి? రెండు..మూడు రోజుల త‌ర్వాత వ‌సూళ్లు ఎలా ఉన్నాయి? వీకెండ్ క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయి? అన్న‌ది ప్ర‌ధానంగా మీడి యాలో చ‌ర్చ సాగేది. కానీ ఓటీటీ మార్కెట్ త‌ర్వాత బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ కంటే ఓటీటీలో బిజినెస్ ఎలా సాగిం ద‌న్న‌ది ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారుతోంది. డే బై డే ఓటీటీ అంత‌కంత‌కు విస్త‌రించ‌డంతో చ‌ర్చంతా ఓటీటీ మార్కెట్ గురించే సాగుతోంది.

సినిమాను ఓటీటీ శాషించ‌డంతోనే ఈ రేంజ్ లో ఓటీటీకి ప్రాధాన్య‌త ఏర్ప‌డింద‌న్న‌ది తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్స్ ఎలా జ‌రుగుతున్నాయ‌న్న‌ది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొస్తుంది. డిసెం బర్ లో రిలీజ్ అవుతోన్న 'అఖండ 2' భారీ ఓటీటీ డీల్ కుదుర్చుకుంది. దాదాపు 82 కోట్ల‌కు డీల్ కుదిరి న‌ట్లు వినిపిస్తోంది. బాలకృష్ణ సినిమాల్లోనే కాదు..సీనియ‌ర్ హీరోలంద‌రిలోనూ బాల‌య్య టాప్ లో నిలిచా రు. చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున లాంటి స్టార్లు ఉన్నా? వాళ్ల సినిమాల‌కు ఈ రేంజ్ లో బిజినెస్ సాధ్యం కాలేదు.

దీంతో మిగ‌తా స్లార్ హీరోల చిత్రాలు నెట్టింట చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. ప్ర‌ధానంగా ఇండియా స్ మోస్ట్ అవైడెడ్ ప్రాజెక్ట్ లుగా తెర‌కెక్కుతోన్న రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్, బ‌న్నీ, మ‌హేష్ చిత్రాల‌పైనే చ‌ర్చ జ‌రుగుతోంది. వీళ్ల‌లో ఓటీటీ బిజినెస్ ఏ హీరో టాప్ లో నిలుస్తాడంటూ డిస్క‌ష‌న్ షురూ అయింది. రామ్ చ‌ర‌ణ్ 'పెద్ది', ప్ర‌భాస్ 'పౌజీ', ఎన్టీఆర్ 'డ్రాగ‌న్', బ‌న్నీ-అట్లీ ప్రాజెక్ట్, ఎస్ ఎస్ ఎంబీ 29 చిత్రాలు అన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో ఓటీటీ బిజినెస్ లో టాప్ లో ఉండే చిత్ర‌మేది అంటూ చ‌ర్చ జ‌రుగు తోంది.

సోషల్ మీడియా వేదిక‌గా అభిమానులంతా ఎవ‌రికి వారే తమ అభిమాన హీరోదే పై చేయి అవుతుందంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్‌, బ‌న్నీ, ఎన్టీఆర్, ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్లు కావ‌డం.. మ‌హేష్ ఇప్పుడే లాంచ్ అవుతుండ‌టంతో? వాళ్ల‌కు మ‌హేష్ గ‌ట్టి పోటీనంటూ అభిమానులు పోస్టులు పెడుతు న్నా రు. ఒక్క సినిమాతో సూప‌ర్ స్టార్ రేంజ్ పాన్ ఇండియాలో మారిపోతుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. తమ స్ఆర్ ది పాన్ ఇండియా కాదు..పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ ఓటీటీ డీల్స్ లో టాప్ లో ఉండే చిత్ర‌మిదే అవుతుంద‌ని అంటున్నారు. ఐకాన్ స్టార్ అభిమానులు కూడా అట్లీతో ప్రాజెక్ట్ విష‌యంలో అంతే కాన్పిడెంట్ గా ఉన్నారు.

ఎవ‌రి సామ‌ర్ధ్యం ఎంత అన్న‌ది? రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డేస‌రికి తేలుతుంది.