ఫిబ్రవరి లాస్ట్ వీక్: హారర్ టు కామెడీ.. ఓటీటీలో రచ్చ రేపనున్న చిత్రాలు/ సిరీస్ లివే!
ప్రపంచవ్యాప్తంగా లీడింగ్ ఓటీటీ ప్లాట్ఫారం గా గుర్తింపు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ లో 'చథా పచ్చ' అనే మలయాళం మూవీ మొదలుకొని 'హాట్ స్పాట్ 2 మచ్' అనే తమిళ్ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
By: Madhu Reddy | 23 Feb 2026 11:21 AM ISTఓటీటీ ఎప్పటిలాగే ఈ ఫిబ్రవరి లాస్ట్ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి ఏకంగా 46 చిత్రాలు, వెబ్ సిరీస్ లతో సిద్ధం అయిపోయింది.. తెలుగు, తమిళ్ , హిందీ, ఇంగ్లీష్ , స్పానిష్ అంటూ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో చిత్రాలను, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకుడికి కావలసిన వినోదాన్ని అందించడానికి సిద్ధం అయిపోయింది. మరి ఈ వారం ఓటీటీలోకి వచ్చిన అలాగే రాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటి ? ఆడియన్స్ ను మెప్పించడానికి సిద్ధంగా ఉన్న తెలుగు చిత్రాలేంటి ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
నెట్ ఫ్లిక్స్:
ప్రపంచవ్యాప్తంగా లీడింగ్ ఓటీటీ ప్లాట్ఫారం గా గుర్తింపు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్స్ లో 'చథా పచ్చ' అనే మలయాళం మూవీ మొదలుకొని 'హాట్ స్పాట్ 2 మచ్' అనే తమిళ్ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. 'రంబుల్', 'ది వైల్డ్ రోబోట్' అనే ఇంగ్లీష్ చిత్రాలతో పాటు 'పావనే' అనే కొరియన్ ఫిలిమ్ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. 'ఫైర్ బ్రేక్' అనే స్పానిష్ సినిమాతో పాటు 'బడక్' అనే మలేషియా సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. వీటితోపాటు 'లవ్ లైఫ్కి, బీయింగ్ గార్డెన్ రామ్సే సీజన్ 1' , 'ది నైట్ ఏజెంట్ 53', 'స్ట్రిప్ లా' వంటి ఇంగ్లీష్ సిరీస్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో బ్రిడ్జ్ ఆర్డర్ సీజన్ 4 పార్ట్ 2 - ఫిబ్రవరి 26 , అష్యుడ్ - ఫిబ్రవరి 27న స్ట్రీమింగ్ కి రానున్నాయి.
జియో హాట్ స్టార్:
ఈవారం జియో హాట్ స్టార్ లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలే అందుబాటులోకి రావడం గమనార్హం. 'మిడిల్ క్లాస్' అనే హిందీ ఫిలింతో పాటు 'లక్కీ ది సూపర్ స్టార్' అనే తమిళ సినిమా విడుదలయ్యింది.. వీటితోపాటు మామా, బాటిల్ షిప్, నేజా 2, రెంటల్ ఫ్యామిలీ వంటి ఇంగ్లీష్ సినిమాలతో పాటు వెయిటింగ్ ఫర్ రెయిన్ అనే కొరియన్ ఫిలిం కూడా జియో హాట్ స్టార్ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసాయి . అలాగే రోబో గోబో సీజన్ 2, 1923 సీజన్ 2 వంటి వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ప్యారడైజ్ సీజన్ 2 - ఫిబ్రవరి 23 , వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ - ఫిబ్రవరి 26 , రోస్లిన్ - ఫిబ్రవరి 27 , సంగమర్మర్ - ఫిబ్రవరి 27 , బ్లాక్ ఫోన్ 2 ఫిబ్రవరి 28 , బుగోనియా - ఫిబ్రవరి 28 , క్రిష్ ఫ్లెమింగ్ : లైవ్ అట్ ది ప్లేస్ ఫిబ్రవరి 28 వంటి చిత్రాలు స్ట్రీమింగ్ కి రానున్నాయి.
ప్రైమ్ వీడియోలో..
వనవీర , ఈషా వంటి తెలుగు చిత్రాలతో పాటు హాట్ స్పాట్ టూ మచ్ అనే తమిళ సినిమా ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ది ఆస్ట్రోనాట్, ది డాగ్స్, 56 డేస్ వంటి ఇంగ్లీష్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు సైకో సయాన్ - ఫిబ్రవరి 24, ది బ్లఫ్ - ఫిబ్రవరి 25
ఇక్కిస్ ఫిబ్రవరి 26 వంటి చిత్రాలు స్ట్రీమింగ్ కి రానున్నాయి.
ఈటీవీ విన్..
ఈటీవీ విన్ లో శ్రీ చిదంబరం సినిమా రిలీజ్ అయింది.
సన్ నెక్స్ట్ ..
అమోజ్ అలెగ్జాండర్ అనే మలయాళ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
జీ ఫైవ్
రాక్షస సీజన్ వన్ కన్నడ సిరీస్ తో పాటు కెన్నెడీ అనే హిందీ సినిమా , పాతి రాత్రి అనే మలయాళ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. వీటితోపాటు అబర్ పోలే -ఫిబ్రవరి 27 , క్రాంతి జ్యోతి విద్యాలయ మధ్యాలయ మరాఠీ - ఫిబ్రవరి 27 , తడయామ్ -ఫిబ్రవరి 27 , ఆదా ప్యార్ 2.0 - ఫిబ్రవరి 28 సినిమాలు స్ట్రీమింగ్ కి రానున్నాయి.
లయన్స్ గేట్ ప్లే:
ఇక్ కుడి ఫిబ్రవరి - 26 న స్ట్రీమింగ్ కి రానుంది.
