Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మిరాయ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

అయితే బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా థియేటర్లలో చూడని వారికి ఓటీటీ లో చూసే అవకాశం రాబోతోంది. ఈ సినిమా ఈ నెల నుండే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

By:  Madhu Reddy   |   4 Oct 2025 12:00 PM IST
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మిరాయ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
X

తేజ సజ్జా హీరోగా.. మంచు మనోజ్ విలన్ గా తెరకెక్కిన మిరాయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో నటించిన హీరోకి,విలన్ కి ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. అయితే బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా థియేటర్లలో చూడని వారికి ఓటీటీ లో చూసే అవకాశం రాబోతోంది. ఈ సినిమా ఈ నెల నుండే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. మరి మిరాయ్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుంది..? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

నెల తిరక్కుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయిన మిరాయ్..

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా చేసిన తాజా మూవీ మిరాయ్. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా.. తేజ సజ్జా, రితికా నాయక్ లు హీరో హీరోయిన్లుగా.. మంచు మనోజ్ మొదటిసారి విలన్ గా నటించారు. అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతున్నట్టు అఫీషియల్ గా జియో హాట్ స్టార్ ప్రకటించింది. ఈ సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీలో అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీగా ఉంది. థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయిన ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చునే జియో హాట్ స్టార్ ద్వారా చూసే అవకాశం లభించబోతోంది.

వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించిన మిరాయ్..

అలా మరో ఐదు రోజుల్లో ఈ సినిమా జియో హాట్ స్టార్ లోకి అందుబాటులోకి రాబోతుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మిరాయ్ మూవీ వరల్డ్ వైడ్ గా 150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ మధ్యలోనే ఓజి, కాంతార: చాప్టర్ 1 లు విడుదలవ్వడం వల్ల ఈ సినిమా కలెక్షన్స్ కి కాస్త గండి పడ్డాయి అని చెప్పుకోవచ్చు.కానీ మిరాయ్ సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది.ఒకవేళ ఓజీ,కాంతార: చాప్టర్ 1 లు రాకపోతే మాత్రం దసరా బరిలో కూడా మిరాయ్ మూవీ అద్భుత కలెక్షన్లను సాధించేది.ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలైంది. అలా సినిమా విడుదలై 20 రోజులు దాటినా కూడా థియేటర్లలో ఇంకా ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఆడుతుంది అంటే అభిమానులను ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు.

మిరాయ్ సినిమా నటీనటులు..

మిరాయ్ మూవీలో నటించిన నటీనటుల విషయానికి వస్తే.. తేజ, రితిక నాయక్ , మంచు మనోజ్ లతో పాటు శ్రియా శరన్, జగపతిబాబు, జయరామ్ లు కీ రోల్స్ పోషించారు. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో దైవత్వం మెయిన్ కాన్సెప్ట్ గా ఉండడంతో సినిమాకి భారీగా కలెక్షన్లు రావడంతో పాటు సినిమాని చాలామంది ఆదరిస్తున్నారు.