Bigg Boss Telugu 10: వైల్డ్‌కార్డ్ కాకపోయి ఉంటే శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యేది కాదా?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 పదో వారం ఎలిమినేషన్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్ శ్వేత నాయుడు హౌస్ నుంచి బయటకు వచ్చారు. సరైన ఓటింగ్ మద్దతు లభించకపోవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు. నాగార్జున ముందు తన జర్నీ వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆలస్యంగా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వడమే ఆమెకు మైనస్‌గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By: Priya Chowdhary Nuthalapti | 16 Nov 2026 9:40 AM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 పదవ వారం ఎమోషనల్ ఫ్యామిలీ వీక్ ముగిసే సరికి, హౌస్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన ప్రముఖ యూట్యూబర్ శ్వేత నాయుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేత నాయుడు.. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఆడియన్స్ నుంచి సరిపడా ఓటింగ్ మద్దతును సంపాదించుకోలేకపోయింది. దీంతో పదవ వారంలో ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. స్టేజ్‌పైకి వచ్చాక హోస్ట్ నాగార్జున సమక్షంలో తన జర్నీ వీడియోను చూసి శ్వేత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తల ప్రకారం, శ్వేతా ఆట బాగా ఆడినప్పటికీ, ఇతరత్రా కారణాల వల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఆమె లేటుగా ఈ ఆటలో కి ఎంటర్ ఐన కారణంగా ఆమెకి సరైన వోటింగ్ బేస్ ఏర్పడలేదు. అదే ఆమె మొదట్లోనే ఈ ఆటలోకి దిగుంటే కచ్చితంగా టాప్ 5 కి వెళ్లగలిగే పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్ అని అందరూ అంటుండటం విశేషం.
ఇక స్టేజ్‌పై నాగార్జున ఆమెకు ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. సూపర్‌మార్కెట్ సెటప్ నుంచి మూడింటిని ఎంచుకుని, వాటిని ముగ్గురు హౌస్‌మేట్స్‌కు డెడికేట్ చేస్తూ కారణాలు చెప్పాలని కోరారు. నిజానికి వైల్డ్‌కార్డ్‌గా లేటుగా రావడమే ఆమెకు కొంత మైనస్‌గా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఎలాంటి కంట్రిబ్యూషన్ ఇవ్వని రామకృష్ణ లేదా నీతూ మాస్టర్ వంటి వారు హౌస్‌లో కొనసాగుతుండగా, శ్వేత లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం ఆమె అభిమానులను నిరాశపరిచింది.
ఇక శ్వేత ఎగ్జిట్ తర్వాత.. హౌస్‌లో ప్రస్తుతం త్రిగుణ్ దూకుడు చూస్తుంటే ఆయన టైటిల్ ఫేవరేట్ రేసులో తిరుగులేని శక్తిగా మారుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆయనే గేమ్ ఛేంజర్ అని భావించేలా త్రిగుణ్ తన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
