Begin typing your search above and press return to search.

యాటిట్యూడ్ వల్లే మళ్లీ బయటకు.. రీఎంట్రీలో అదే తప్పు..?

బిగ్ బాస్ సీజన్ 9లో శ్రీజ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అన్న ఆడియన్స్.. ఇప్పుడు హౌస్ లో ఆమె చేస్తున్న హంగామా చూసి షాక్ అవుతున్నారు.

By:  Ramesh Boddu   |   31 Oct 2025 10:11 AM IST
యాటిట్యూడ్ వల్లే మళ్లీ బయటకు.. రీఎంట్రీలో అదే తప్పు..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో శ్రీజ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అన్న ఆడియన్స్.. ఇప్పుడు హౌస్ లో ఆమె చేస్తున్న హంగామా చూసి షాక్ అవుతున్నారు. శ్రీజ ఎలిమినేషన్ ఎలా జరిగింది అంటే.. వైల్డ్ కార్డ్స్ వచ్చి వాళ్ల పవర్ తో సుమ శెట్టి, శ్రీజ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉండగా వాళ్లంతా శ్రీజని ఎలిమినేట్ చేశారు. అక్కడ శ్రీజ ఎలిమినేషన్ కి ఆమె యాటిట్యూడ్ కారణమని ఆరోజే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వచ్చీ రాగానే పేర్లు అడిగి తెలుసుకునే రైట్ ఉంటుంది. మాధురితో పేరు విషయంలో అనవసరమైన ఇష్యూ క్రియేట్ చేసింది.

శ్రీజతో పాటు భరణికి రీ ఎంట్రీ ఛాన్స్..

ఇక బయటకు వెళ్లిన శ్రీజ ని అన్ ఫెయిర్ గా ఎలిమినేట్ చేశారంటూ ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అందుకే ఆమెకు ఆమెతో పాటు భరణికి రీ ఎంట్రీ ఛాన్స్ ఇచ్చారు. ఐతే శ్రీజ ఒక్క దానికే ఇస్తే బిగ్ బాస్ ఆమె పట్ల బయాస్ గా ఉన్నాడని అనుకుంటారని భరణికి కూడా రెండో ఛాన్స్ ఇచ్చారు. ఐతే అది కూడా వాళ్లిద్దరిలో హౌస్ లో ఎవరో ఒకరు ఉండేలా అటు హౌస్ మెట్స్ కి టాస్క్ లు దానితో పాటు ఇటు ఆడియన్స్ ఓటింగ్ కూడా పెట్టారు.

ఐతే హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీజ ఇకనైనా ఆట మీద ఫోకస్ చేస్తుందేమో అనుకుంటే ఆమె పోకింగ్ మాత్రం మానలేదు. రీ ఎంట్రీలో నామినేషన్స్ టైం లో తనూజ ఇక మీదట అక్క అని పిలవను అన్నది. మాధురి తో మీ గురించి బయట అడిగినా ఎవరు చెప్పలేదు. మిమ్మల్ని మాధురి అని పిలవాలో, రాజు అని పిలవాలో అంటూ సెటైర్ వేసింది. ఇక ఆమెను హౌస్ లో ఉంచే టాస్క్ లలో తనూజ ఆమెకు ఎగైనెస్ట్ గా ఉండి భరణికి సపోర్ట్ చేస్తుందని తనూజ మీద ఫైర్ అవుతుంది శ్రీజ.

డైనింగ్ టేబుల్ దగ్గర కూడా..

అంతేకాదు గురువారం డైనింగ్ టేబుల్ లో తనకు కర్రీ లేకుండా చేశారని.. అడిగితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పింది శ్రీజ. ఆమె యాటిట్యూడ్ చూసి ఇందుకా ఆమెను హౌస్ లోకి పంపించింది అనే భావన వచ్చేలా చేశారు. ఆట మీద కాకుండా యాటిట్యూడ్ తో ఆమె పైచేయి సాధిద్దాం అనుకుంటే చివరకు ఆడియన్స్ ఆమెను బయటకు పంపించారు. పర్మినెంట్ హౌస్ మెట్ గా శ్రీజ కాకుండా భరణికే ఆడియన్స్ ఓట్ వేశారు.

ఐతే దీనిపై ఈసారి శ్రీజ గురించి అన్ ఫెయిర్ అనే కామెంట్స్ రావట్లేదు. ఎందుకంటే హౌస్ లో ఆమె వ్యవహరించిన తీరు చూస్తే అర్ధమవుతుంది. ఆట ఆడటం వరకు ఓకే కానీ పర్సనల్ ఎజెండా, యాటిట్యూడ్ లాంటివి చూపిస్తే కచ్చితంగా ఆడియన్స్ బయటకు పంపించేస్తారు. అలా అప్పుడు శ్రీజ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అన్న వాళ్లే ఇప్పుడు ఆమె హౌస్ నుంచి బయటకు వస్తే సైలెంట్ అయిపోయారు.