Begin typing your search above and press return to search.

తెలుసు కదా ఓటీటీ రైట్స్ వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ జాబితాలోకి మరొకరు చేరిపోయారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరు తెచ్చుకున్న నీరజకోన 'తెలుసు కదా' సినిమాతో దర్శకురాలుగా మారారు.

By:  Madhu Reddy   |   5 Nov 2025 10:06 AM IST
తెలుసు కదా ఓటీటీ రైట్స్ వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. చాలామందికి డైరెక్షన్ చేయాలి అని డ్రీమ్ ఉన్నా కూడా వాళ్లకున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఏదో ఒక పనికి పరిమితం అయిపోతారు. అయితే ప్రస్తుతం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి మంచి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ప్రస్తుతం నందిని రెడ్డి సమంత హీరోయిన్ గా మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది.

డైరెక్టర్ గా మారిన కాస్ట్యూమ్ డిజైనర్..

ఈ జాబితాలోకి మరొకరు చేరిపోయారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరు తెచ్చుకున్న నీరజకోన 'తెలుసు కదా' సినిమాతో దర్శకురాలుగా మారారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. ముఖ్యంగా ట్రైలర్ చూసిన వెంటనే చాలామందికి ఈ సినిమా చూడాలి అని ఆసక్తి కలిగింది. ట్రైలర్లో కట్ చేసిన కంటెంట్ మాత్రమే సినిమాలో కూడా హై ఇచ్చింది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ రైటింగ్ ఈ సినిమాకి ప్లస్ అయింది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన తెలుసు కదా..

అలా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. వాస్తవానికి రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమా ఓటీటీ కి రావడానికి పెద్దగా టైం తీసుకోవడం లేదు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయితే కొంతమేరకు లేట్ అవుతుంది. కానీ సినిమా ఫలితం తేడా అయితే మాత్రం అతి తక్కువ రోజుల్లోనే ఓటీటీ లో దర్శనం ఇస్తుంది.

ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇప్పుడు తెలుసు కదా సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. నవంబర్ 13న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఒక బజ్ వినిపిస్తోంది. ఇక దీనిపై నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే. అక్టోబర్ 17న దీపావళి కానుకగా ఈ సినిమా విడుదలైంది. మరోవైపు ఈ సినిమాకి కొన్నిచోట్ల డీసెంట్ టాక్ వచ్చింది. కానీ యునానిమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. మొత్తానికి ఈ సినిమా కొంతమేరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి నష్టాలు తెచ్చింది అని కథనాలు కూడా వినిపించాయి.

సిద్దు కం బ్యాక్ ఇవ్వాలి

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ నటులలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు సిద్దు. తర్వాత కాలంలో ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు తన రైటర్ టాలెంట్ బయట పెట్టాడు.

సిద్దు కెరియర్ లో డీసెంట్ సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నా కూడా తనకి విపరీతమైన పేరు తీసుకొచ్చిన సినిమా డిజే టిల్లు. ముఖ్యంగా ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో పెద్దగా కథ లేకపోయినా కూడా కేవలం ఆ క్యారెక్టర్రైజేషన్ వర్క్ అవుట్ అవ్వడం వల్లనే సిద్దుకు విపరీతమైన పేరు వచ్చింది.

అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ జాక్ అనే సినిమాను చేశాడు. ఒకప్పుడు ఆరెంజ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన సిద్దు ఏకంగా భాస్కర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అంటే అప్పట్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఊహించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా సక్సెస్ సాధించలేకపోయింది.

ఇక తెలుసు కదా సినిమా వర్కౌట్ అవుతుంది అనుకుంటే అది కూడా అవ్వలేదు. సినిమాలో అక్కడక్కడ సిద్దు చెప్పే డైలాగులు తప్ప, సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఓటిటి లో ఈ సినిమాకి ఎటువంటి స్పందన లభిస్తుందో వేచి చూడాలి.