Begin typing your search above and press return to search.

ఫ్రైడే ఓటీటీ మూవీస్.. తెలుగు లవర్స్ కి సినిమాల పండుగ !

అందులో ప్రత్యేకించి కొన్ని చిత్రాలు ఆడియన్స్ ఫేవరెట్ గా నిలవబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రాలు , వెబ్ సిరీస్ లో ఏంటో ఇప్పుడు చూద్దాం.

By:  Madhu Reddy   |   4 Sept 2026 10:55 AM IST
ఫ్రైడే ఓటీటీ మూవీస్.. తెలుగు లవర్స్ కి సినిమాల పండుగ !
X

శుక్రవారం వచ్చిందంటే చాలు ఏ ఏ చిత్రాలు , వెబ్ సిరీస్ లు ఏ ఏ ప్లాట్ఫామ్ లలో అందుబాటులోకి వస్తాయో అని ఎదురు చూసే అభిమానులు చాలామంది ఉన్నారు. అందుకే ఎప్పటిలాగే ఈ శుక్రవారం ప్రత్యేకించి సెప్టెంబర్ తొలివారం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏకంగా 10కి పైగా చిత్రాలు, సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసాయి. అందులో ప్రత్యేకించి కొన్ని చిత్రాలు ఆడియన్స్ ఫేవరెట్ గా నిలవబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రాలు , వెబ్ సిరీస్ లో ఏంటో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో ఫ్రైడే మూవీస్, సిరీస్..

వరుణ్ తేజ్ హీరోగా , మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి, రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మంచి విజయం అందుకున్న కొరియన్ కనకరాజు.. సెప్టెంబర్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రంతోపాటు హిందీ మూవీ ధమాల్ 4, ఇంగ్లీష్ సిరీస్ ఎర్లీ మీట్స్ వరల్డ్, ఇంగ్లీష్ డాక్యుమెంటరీ ఫిలిం టీనేజ్ వేస్ట్ ల్యాండ్, తమిళ్ మూవీ జీడీఎన్, హాలీవుడ్ మూవీ అమినే క్రాఫ్ట్ నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. అలాగే సెప్టెంబర్ 6న మరో హాలీవుడ్ మూవీ ది బ్రెడ్ విన్నర్ స్ట్రీమింగ్ కి రాబోతోంది.

తెలుగు సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ సందడి..

గోదావరి నదీ తీరాన శతాబ్దాల వారసత్వానికి కుటుంబ రహస్యాలు, ముసుగు గుర్తింపులు ముప్పుగా పరిణమించిన ఒక పవిత్ర ఆలయ పట్టణంలో క్రమశిక్షణ కలిగిన సంగీత వారసుడు, కీర్తితో విసిగిపోయిన ఒక పాప్ స్టార్ మధ్య ఒక ఊహించని బంధం ఏర్పడుతుంది . తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిరీస్ జగమే సంగీతం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఈ సిరీస్ ని పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా.. ప్రకాష్ రాజు ,మేకా శ్రీకాంత్, మధు తదితరులు కీలకపాత్రలు పోషించారు.

జియో హాట్ స్టార్..

అలాగే తెలుగు డబ్బింగ్ సిరీస్ ద కోర్ట్ కూడా నేటి నుండి జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది.

జీ 5:

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం గా గుర్తింపు తెచ్చుకున్న జి ఫైవ్ లో తెలుగు సిరీస్ వీరభద్రుని రహస్యం సీజన్ వన్ పార్ట్ 2 స్ట్రీమింగ్ కి వచ్చింది.

సన్ నెక్స్ట్:

ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డిసి. తమిళ్లో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ మూవీ సెప్టెంబర్ 4 అనగా నేటి నుండి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

సోనీ లివ్:

మరో తెలుగు డబ్బింగ్ మూవీ ఉన్మాదం సోనీ లివ్ ద్వారా నేడు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది .

సెప్టెంబర్ తొలి వారంలో అటు థియేటర్లలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇటు ఓటీటీ లలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో సినిమాలు వచ్చేసాయి. పైగా నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు కావడం.. శని ఆదివారాలు వీకెండ్స్ కావడంతో మరి మీరు నచ్చిన సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి.