Begin typing your search above and press return to search.

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా రోహిత్ అనూహ్యంగా ఎగ్జిట్ కావడం పట్ల ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   2 Nov 2026 12:20 PM IST
Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?
X

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. సీజన్ ప్రారంభం నుంచే టైటిల్ ఫెవరేట్‌గా, టాప్-2 లేదా టాప్-5లో కచ్చితంగా ఉంటాడని అందరూ భావించిన బలమైన కంటెస్టెంట్ రోహిత్ నాయుడు పట్నం 60 రోజులు కూడా పూర్తి కాకుండానే హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం టెలివిజన్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా రోహిత్ అనూహ్యంగా ఎగ్జిట్ కావడం పట్ల ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు నుంచి రోహిత్ తన దూకుడు స్వభావంతోనే ముందుకు వెళ్లాడు. చిన్న చిన్న విషయాలకూ అతిగా రియాక్ట్ అవ్వడం, అనవసరమైన సెటైర్లు వేయడం, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అతనికి అలవాటుగా మారింది. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే షాలిని కూడా ఇదే పద్ధతిని అనుసరించడంతో ఇద్దరిపై నెగెటివిటీ పెరిగింది.

హౌస్‌లో పనుల చర్చ వచ్చినప్పుడు రోహిత్ సరిగ్గా స్పందించకపోవడం, నాకు అలవాటు లేదు అన్నట్లుగా ప్రవర్తించడం ప్రేక్షకులకు నచ్చలేదు. 'అగ్ని పరీక్ష' ద్వారా సామాన్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్.. ఆ తర్వాత తన ప్రవర్తన కారణంగా ఆడియన్స్‌కు క్రమంగా దూరమయ్యాడు. షాలినితో ఉన్న సాన్నిహిత్యం కూడా అతని గేమ్‌కు కొంత మైనస్‌గా మారింది.

ప్రతి వారాంతంలో హోస్ట్ నాగార్జున వచ్చి రోహిత్, షాలినిల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, వారి తప్పులను ఎత్తిచూపడం జరిగేది. త్రిగుణ్ కూడా దూకుడుగా ఉన్నప్పటికీ, అతను ఎమోషనల్ కనెక్ట్ తెచ్చుకోగలిగాడు. కానీ నాగార్జున ఎంత హెచ్చరించినా రోహిత్ తన పద్ధతిని మార్చుకోలేదు. పైగా నేరుగా బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌నే ప్రశ్నించే స్థాయికి వెళ్లడం ఆయన పరిస్థితిని మరింత దిగజార్చింది.

మొత్తానికి రోహిత్ తన స్వయంకృతాపరాధాలతో పాటు, మేకర్స్ వ్యూహాత్మక ప్లానింగ్ కారణంగానే టైటిల్ రేసు నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ క్రమంలో చాలా మంది రోహిత్ మళ్ళీ తిరిగొస్తాడని కూడా చెప్తున్నారు. అయితే రోహిత్ మరో అవకాశం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడా లేదా అనే విషయం మాత్రం మనం వేచి చూడాలి.