Begin typing your search above and press return to search.

హౌస్ లో బ్యాడ్ చేశారు.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చి పడేసిన .. చిట్టి పికిల్స్ రమ్య..!

అంతేకాదు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన తనూజ మీద రమ్య నామినేషన్స్ లో ఫేక్ పిల్ల, బాండింగ్ కోసమే వచ్చింది అనడం ఆమెకు బ్యాడ్ అయ్యింది.

By:  Ramesh Boddu   |   2 Nov 2025 9:08 AM IST
హౌస్ లో బ్యాడ్ చేశారు.. ట్రోలర్స్  కి గట్టిగా ఇచ్చి పడేసిన .. చిట్టి పికిల్స్ రమ్య..!
X

బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చింది చిట్టి పికిల్స్ రమ్య మోక్ష. సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ అయిన ఈ అమ్మడు బిగ్ బాస్ కి వెళ్తుంది అనగానే ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. హౌస్ లో ఎలా ఉంటుంది.. ఎలా కనిపిస్తుంది అన్న ఆసక్తి ఏర్పడింది. ఐతే హౌస్ లోకి వెళ్లిన రమ్య మోక్ష కొందరిని టార్గెట్ చేసుకుని వెళ్లినట్టుగా అయ్యింది. తనూజతో క్లోజ్ గా ఉంటున్న కళ్యాణ్ ని అమ్మాయిల పిచ్చోడని అనడంతో పాటుగా రీతు, కళ్యాణ్ ల క్లోజ్ నెస్ మీద కామెంట్స్ చేయడం లాంటివి ఆమెను బ్యాడ్ చేశాయి.

తనూజ మీద రమ్య నామినేషన్స్..

అంతేకాదు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన తనూజ మీద రమ్య నామినేషన్స్ లో ఫేక్ పిల్ల, బాండింగ్ కోసమే వచ్చింది అనడం ఆమెకు బ్యాడ్ అయ్యింది. ఐతే రమ్య మోక్ష హౌస్ నుంచి బయటకు వచ్చాక తన బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ గురించి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పింది. తన గురించి హౌస్ లో బ్యాడ్ గా చూపించారని అంటుంది అమ్మడు. అక్కడ చాలా విషయాలు జరిగాయి కానీ కేవలం బ్యాడ్ చేద్దామనే హౌస్ లోకి పిలిచినట్టు ఉన్నారు. అందుకే కేవలం బ్యాడ్ థింగ్స్ మాత్రమే చూపించారని అన్నది రమ్య.

అంతేకాదు తను ఒరిజినల్ గానే ఉన్నానని.. నీళ్లు పడక ఇబ్బంది పడ్డానని.. హెల్త్ కూడా చాలా ఇబ్బంది పెట్టిందని అన్నది రమ్య. తనకు హౌస్ లో ఫీవర్ వచ్చింది..హెల్త్ ప్రాబ్లెం ఉండటం వల్ల గవదలు లావయ్యాయి. అందుకే కొన్ని చోట్ల ఫేస్ రౌండ్ గా కనిపించిందని అన్నది రమ్య. ఐతే హౌస్ లో తాను ఉన్నప్పుడు తన గురించి విపరీతమైన ట్రోల్స్ చేసారు. తన లుక్ గురించి రకరకాలుగా కామెంట్ చేశారు.

ఈ ట్రోల్స్ నాకు కొత్త కాదు..

నాకు ఈ ట్రోల్స్ అనేవి కొత్త కాదు.. మీరేమనుకున్నా నాకు ఏమి కాదు. నన్ను ఎంకరేజ్ చేస్తూ చేసిన కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇక బిగ్ బాస్ కి వెళ్లొచ్చినందుకు మంచి పారితోషికం ఇచ్చారు. సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. నా లైఫ్ అంతా బాగుంది కానీ మీరు మాత్రమే ఇంకా ట్రోల్స్ చేస్తూ అలానే ఉండిపోతున్నారని అన్నది రమ్య మోక్ష.

తనకు స్నాప్ చాట్ వాడటం తెలియదని.. తను ఎలా ఉన్నానో అలానే వీడియోస్ పెడతానని.. హౌస్ లో వేరేలా కనిపించా అంటే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయని అన్నది రమ్య. హౌస్ లో విప్పుకుని తిరగలేం.. బయట ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు.. అక్కడ కొన్ని కండీషన్స్ ఉంటాయని తన బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ చెప్పి మరోసారి ట్రోలర్స్ కి తాను భయపడేది లేదని చెప్పింది చిట్టి పికిల్స్ రమ్య.